భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య, మెదక్ జిల్లాలో విషాద ఘటన
Districts
oi-Pratapreddy
By Pratap
మెదక్: మెదక్ మండలంలోని బూరుగుపల్లిలో ఓ వ్యక్తి భార్యను హత్యచేసి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాల కారణంగా ఉపేందర్ తన భార్య అనూరాధను పొలంలో గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం తాను ఇంటికి వచ్చి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ దంపతులకు ఇద్దరు కూతుర్లు, ఓ కుమారుడు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణ నెలకొంది.