వైయస్ జగన్‌కు కాంగ్రెసు ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ బహిరంగ లేఖ

తనకు వైయస్సార్ మెయిల్ చేసిన లేఖలోని మొదటి పేరాను మాత్రమే వెల్లడించానని, మిగతా పేరాలను విడుదల చేయలేదని, మొత్తం లేఖను జగన్‌కు అందించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. ఎవరైనా వచ్చి తన నుంచి లేఖను తీసుకోవచ్చునని ఆయన అన్నారు. తాను వైయస్ రాజశేఖర రెడ్డికి మిత్రద్రోహిని కానని, తాను వైయస్ అనుయాయుడినని ఆయన చెప్పుకున్నారు. తన వ్యక్తిత్వం వైయస్ రాజశేఖర రెడ్డికి తెలుసునని ఆయన అన్నారు. తాను అసత్య ప్రచారం చేసేవాడిని కానని, ఆనాడు వైయస్ మాటను పాటించినవాడినని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications