కెవిపి అవినీతిపై విచారణ జరిపించండి: టిడిపి నేత ఎర్రంనాయుడు డిమాండ్

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై, ఆయన కుమారుడు వైయస్ జగన్‌పై తాము ఫిర్యాదులు చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వారి అవినీతిలో వాటాలు ఉండడం వల్లనే ప్రధాని మన్మోహన్ సింగ్ గానీ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గానీ పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. తన పదవి ఊడిపోతుందనే భయంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా విచారణలకు ఆదేశించడం లేదని ఆయన విమర్శించారు. పలు కుంభకోణాలు వెలుగు చూసినా ముఖ్యమంత్రి పట్టించుకోకుండా కుర్చీని కాపాడుకోవడానికే చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications