హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొండా సురేఖపై వేటు తప్పదు, ప్రక్రియ ప్రారంభం: విప్ కొండ్రు మురళి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kondru Murali
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్గం కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖపై వేటు తప్పదని ఆ పార్టీ చీప్ విప్ కొండ్రు మురళి గురువారం విలేకరులతో అన్నారు. సురేఖపై వేటు వేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని చెప్పారు. త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. సురేఖ కాంగ్రెసు పార్టీపై, పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీపైన చేసిన వ్యాఖ్యలు పార్టీ కార్యకర్తల మనసులను తీవ్రంగా గాయపరిచాయన్నారు.

పార్టీనిగానీ, మేడంనుగానీ దూషించే వారిపై చర్యలు ఉంటాయన్నారు. సురేఖపై చర్యలు తీసుకోవడం ఇప్పటికే ఆలస్యం అయిందన్నారు. ఇక ఆలస్యం చేయదల్చుకోలేదన్నారు.ఆమె పార్టీకి, సోనియాకు వ్యతిరేకంగా చేసి వ్యాఖ్యలను అధిష్టానానికి పంపించామని చెప్పారు. వారు పరిశీలించిన మీదట చర్యలు తీసుకోవాలని మమ్మల్ని అదేశించారని చెప్పారు.

English summary
Congress decided to take action against MLA Konda Surekha, process was already started, it would be completed soon, said Congress chief whip Kondru Murali today. He said that all the followers of party were hurt with Surekha comments against AICC president Sonia Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X