చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి, వైయస్ జగన్‌లపై చంద్రబాబు తీవ్రమైన కామెంట్స్

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
చిత్తూరు: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌పై, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదవి కోసమే వైయస్ జగన్ కాంగ్రెసు నుంచి వెళ్లిపోయారని, పదవి కోసమే చిరంజీవి కాంగ్రెసులోకి వచ్చారని ఆయన శనివారం చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో విలువలు లేకుండా పోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి రహిత రాజకీయాలు నేటి అవసరమని ఆయన అన్నారు. వైయస్ జగన్ సంపదపై కూడా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

వైయస్ జగన్ 83 కోట్ల రూపాయల ముందస్తు పన్ను చెల్లించారని, ఆ రకంగా జగన్ ఆదాయం 250 కోట్ల రూపాయల దాకా ఉంటుందని, అయితే ఆ ఆదాయం జగన్ ఏ రూపంలో సంపాదిస్తున్నాడనే విశ్లేషణ లేకుండా పోయిందని, అక్రమ సంపాదనను క్రమబద్దీకరించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా నల్లధనాన్ని క్రమబద్దీకరించే పనికి ప్రభుత్వం పూనుకుందని, ఇది దేశభద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆయన అన్నారు. దేశాన్ని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ లూటీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నల్లధనంపై సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ ఉదాసీన వైకరి అవలంబించడమే కాకుండా నల్లధనాన్ని సక్రమ డబ్బుగా మార్చడానికి తగిన పద్ధతులు అవలంబిస్తున్నారని ఆయన అన్నారు.

కాంగ్రెసు నాయకులు పదవుల కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసు రాష్ట్ర నాయకులు ఢిల్లీకి తోలుబొమ్మలుగా మారిపోయారని ఆయన విమర్శించారు. కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు పార్టీ నుంచి వెళ్లిపోయిన వైయస్ జగన్‌తో బహిరంగంగా తిరుగుతున్నారని, అయినా కాంగ్రెసు చర్యలు తీసుకోవడం లేదని, నీతిమాలిన రాజకీయాలను సాగిస్తున్నారని ఆయన అన్నారు.

English summary
Telugudesam president Nara Chandrababu Naidu has made wild comments against YS Jagan and Chiranjeevi. One was left Congress party and another joined the party post, he said on YS Jagan and Chiranjeevi. He questioned YS Jagan's income sources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X