హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ ఏ కోర్ కమిటీ సభ్యుడితో మాట్లాడుతున్నారో తెలియదా: దేవేందర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Devender Goud
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తమ పార్టీపై చేసిన విమర్శలపై తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకుడు టి. దేవేందర్ గౌడ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. కెసిఆర్ కాంగ్రెసుకు చెందిన ఏ కోర్ కమిటీ సభ్యుడితో మాట్లాడుతున్నారో తమకు తెలియదా అని ఆయన అడిగారు. తెరాస ముమ్మాటికీ కాంగ్రెసు బ్రాంచ్ ఆఫీసేనని, ఈ బ్రాంచ్ ఆఫీసు హెడ్ ఆఫీసులో కలిసిపోవడం ఖాయమని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. తెరాస కాంగ్రెసులో విలీనం కావడం నూటికి నూరు శాతం ఖాయమని ఆయన అన్నారు. డొంక తిరుగు మాటలతో కెసిఆర్ విషయాన్ని తప్పు దోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయని ఆయన అన్నారు.

తెలంగాణ సాధనలో కెసిఆర్ ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలని తాము కోరుకుంటున్నామని, కానీ తెలుగుదేశం పార్టీని బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తే సహించబోమని ఆయన అన్నారు. గాలి మాటలు మాట్లాడుతూ కెసిఆర్ తమపై విమర్శలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. కెసిఆర్ తెలంగాణ సమస్యలపై ఏనాడూ పోరాటం చేయలేదని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీతో కెసిఆర్ కుమ్మక్కయిన మాట నిజమని ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కలిసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం బలపడిన స్థితిలో కెసిఆర్ ఆవిశ్వాస తీర్మానాన్ని ముందుకు తేవడం వెనక ఉద్దేశమేమిటని ఆయన అడిగారు.

ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల వైయస్ జగన్ కాంగ్రెసు నుంచి వెళ్లిపోయారని ఆయన అన్నారు. ప్రజల కోసమో, సిద్ధాంతాల కోసమో జగన్ కాంగ్రెసు పార్టీని వ్యతిరేకించలేదని ఆయన అన్నారు. జగన్ వెంట ఎవరుంటారో, ఎవరు ఉండరో తెలియని అయోమయ స్థితి అని, ఈ స్థితిలో జగన్‌తో కలిసి ప్రభుత్వాన్ని కూలుస్తామనడం సరైంది కాదని ఆయన అన్నారు.

English summary
Telugudesam Telangana region leader T Devender Goud lashed out at TRS president KCR. He said that TRS will merge in Congress. He said that TRS is working as a branch office to Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X