Talliki Vandanam: తల్లికి వందనంపై కీలక అప్డేట్..! ఈసారి డబ్బుల జమకు ఇలా..!

ఏపీలో ఈ ఏడాది తల్లికి వందనం (Talliki Vandanam) పథకం కింద రూ.13 వేలు అందించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇందుకోసం ముందుగా పాఠశాలల నుంచి విద్యార్దుల ఆధార్, ఇతర వివరాలు సేకరించిన ప్రభుత్వం .. వాటిని సచివాలయాలకు పంపింది. అక్కడ వీటిని హౌస్ హోల్డ్ డేటా బేస్ తో సరిపోలుస్తున్నారు. ఈ కార్యక్రమం పూర్తి కాగానే నిధుల విడుదలకు రంగం సిద్దం చేస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా సవ్యంగా పూర్తయితే జూన్ 12 కల్లా తల్లికి వందనం నిధులు విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ అవుతాయి.

తల్లీ వందనం పథకం కింద అర్హులైన విద్యార్థులు, వారి తల్లుల వివరాలను ఇప్పటికే సచివాలయాలకు పంపారు. అక్కడ హౌస్ హోల్డ్ డేటాబేస్ తో సరిపోల్చే ప్రక్రియ చేపడుతున్నారు. సచివాలయాల్లోని ల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ (WEA) లేదా వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ (WWES) ఈ వెరిఫికేషన్ పూర్తి చేస్తారు. ఈ వెరిఫికేషన్ మాడ్యూల్ నవశకం లబ్దిదారుల మేనేజ్ మెంట్ పోర్టల్ లో (Beneficiary Management Portal) అందుబాటులో ఉంటుంది. తల్లి అందుబాటులో ఉంటే ఆమెను హౌసోల్డ్ డేటాబేస్లో చేర్చాలి. లేనిపక్షంలో తండ్రి లేదా గార్డియన్ వివరాలను నమోదు చేయాలి.

AP Government Launches Data Verification Drive for Talliki Vandanam Scheme Ahead of Fund Disbursal

విద్యార్థి, తల్లి వేర్వేరు కుటుంబాలలో ఉంటే మైగ్రేషన్ ఆప్షన్ ఉపయోగించి వారిద్దరినీ ఒకే ఇంటి కిందకు తీసుకువస్తారు. ఒకే తల్లికి నలుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉంటే .. క్షేత్రస్థాయికి వెళ్లి పిల్లలందరూ ఆ తల్లికే జన్మించారా లేదా అనేది వెరిఫై చేసి, సరైన రిమార్కులు నమోదు చేస్తారు. విద్యార్థి మరియు తల్లికి ఒకే ఐడీ నంబర్ ఉంటే సదరు ఐడీ నంబర్ ను సరైన వ్యక్తికి ట్యాగ్ చేసి, రెండో వ్యక్తి యొక్క అసలైన ఐడీ వివరాలను సేకరించి అప్డేట్ చేస్తారు. ఈ పరిశీలన ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ వర్తిస్తుంది. డేటా వెరిఫికేషన్ సకాలంలో, ఖచ్చితంగా పూర్తి చేయకపోతే అర్హులైన విద్యార్థులకు తల్లీ వందనం పథకం నిధులు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. సచివాలయ ఉద్యోగులు ఈ 5 రకాల సమస్యలను పరిష్కరించి వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాతే తుది అర్హుల జాబితా విడుదల చేస్తారు. అనంతరం నిధులు విడుదలవుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+