నాగార్జున గగనం కథను కాపీ కొట్టారు?, అవునంటున్న రచయిత్రి

కథనంతో పాటు కొన్ని దృశ్యాలు, సంభాషణలు పూర్తిగా తన నవలలోనివేనని ఆమె ఆరోపించారు. తన నవలలోని శ్రీచక్ర హీరో పాత్రనే నాగార్జున పాత్ర పోలి ఉందని ఆమె చెప్పారు. క్లైమాక్స్ కాస్తా మార్చారని ఆమె చెప్పారు. కథనం, సంఘటనలు తన నవలలోని వాటిని పోలి ఉండడాన్ని బట్టి కాపీ కొట్టారనేది స్పష్టమవుతోందని ఆమె అన్నారు. అయితే, ఆ వాదనను నిర్మాత దిల్ రాజు త్రోసిపుచ్చారు. రాధామనోహర్‌కు తెలుగు రాయడం గానీ చదవడం గానీ రాదని ఆయన అన్నారు. పాపులారిటీ కోసం మీడియాకు ఎక్కి విమర్శలు చేయడం మంచిది కాదని ఆయన అన్నారు. ఐడియా ఒక్కటే అయి ఉండవచ్చునని, హైజాక్‌పై చాలు సినిమాలు వచ్చాయని, అంత మాత్రాన కాపీ అని చెప్పడం మంచిది కాదని ఆయన అన్నారు.
Comments
English summary
A Telugu Novelist Mucharla Rajini shakunthala alleges her novel was stolen for Nagarjuna's Gaganam film. She said that Radhamanohar copied he novel, which was written in 2000 based on Kandahar hijack incident. Producer Dil Raju denied hear allegations.
Story first published: Saturday, February 12, 2011, 17:27 [IST]