హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి విలీనం నిర్ణయం రాజకీయ వ్యభిచారమే: జూపూడి ప్రభాకర రావు

By Pratap
|
Google Oneindia TeluguNews

Jupudi Prabhakar Rao
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయాలనే చిరంజీవి నిర్ణయం రాజకీయ వ్యభిచారమేనని మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ప్రతిపక్షాల ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానంతో తమకు సంబధం లేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. అవిశ్వాసంపై తేల్చుకోవాల్సింది ప్రతిపక్షాలేనని ఆయన అన్నారు.

దివంగత వైఎస్సార్‌ను విమర్శిస్తే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. వైఎస్‌ను విమర్శిస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు ఎలా ఊరుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. పార్టీని విమర్శించిన వారిపై చర్యలు తీసుకోవడం మొదలెడితే చాలా మందిపై చర్య తీసుకోవాల్సి వుంటుందని కాంగ్రెస్ పార్టీకి చురకలంటించారు. చిరంజీవి, పీఆర్పీ ఎమ్మెల్యేలు ఏ గంగలో దూకినా తమకు అభ్యంతరం లేదని, కానీ వాళ్ళకు ఓట్లు వేసిన ప్రజలకు సమాధానం చెప్పక తప్పదని అన్నారు.

English summary
Congress MLC Jupudi Prabhakar Rao belongs to YS Jagan camp termed Chiranjeevi's Prajarajyam merger in Congress as political prostitution. He warned the leaders face dire consequence if they continue to criticise YS Rajasekhar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X