హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డితో కుమ్మక్కు, జగన్‌ను పొగడలేదు: కెటిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

KT Rama Rao
హైదరాబాద్: తమ పార్టీపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు ఖండించారు. తాము అవిశ్వాసం పెడితే తెలుగుదేశం పార్టీ మద్దతివ్వాలని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేసిన డిమాండ్‌పై చంద్రబాబు శనివారం చిత్తూరు జిల్లాలో తీవ్రంగా మండిపడ్డారు. కెసిఆర్ వైయస్ జగన్‌ను ప్రశంసిస్తోందని ఆయన విమర్శించారు. 11 మందితో కెసిఆర్ ప్రభుత్వంపై అవిశ్వాసం ఎలా పెడుతారని ఆయన అడిగారు. తమ పార్టీ ఎజెండాను మరో పార్టీ నిర్ణయించలేదని ఆయన అన్నారు. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై కెటి రామారావు శనివారం మీడియా ప్రతినిధుల వద్ద తీవ్రంగా ప్రతిస్పందించారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల మధ్య చీకటి ఒప్పందం ముమ్మాటికీ నిజమని, చంద్రబాబు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కుమ్మక్కయ్యారని ఆయన విమర్శించారు. ఒక ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీతో కుమ్మక్కు కావడం దేశ చరిత్రలో ఎప్పుడూ లేదని, ఇప్పుడు చంద్రబాబుతోనే చూస్తున్నామని ఆయన అన్నారు.

సమైక్యవాది వైయస్ జగన్‌ను తాము ఎప్పుడూ ప్రశంసించలేదని ఆయన స్పష్టం చేశారు. వైయస్ జగన్ వరంగల్ జిల్లాకు వస్తానంటే యుద్ధం ప్రకటించింది తమ పార్టీయేనని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు చేతిలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు తోలుబొమ్మలుగా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రతిపాదించడం లేదో చంద్రబాబు ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకిగా మారి వలసవాదిగా ప్రవర్తిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు తెలంగాణ ప్రజల మద్దతు కోల్పోయారని ఆయన అన్నారు.

English summary
TRS MLA KT Rama Rao condemned TDP president Chandrababu's comments on his TRS party. He criticized that Chandrababu had colluded with CM Kiran Kumar Reddy to oppose Telangana. He clarified that TRS had never supported YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X