హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అన్ని ఉద్యోగాలూ తెలంగాణ వారివే: జిహెచ్ఎంసి సదస్సులో కెసిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత జిహెస్‌ఎంసిలో అందరూ తెలంగాణ ఉద్యోగులే ఉంటారని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం అన్నారు. హైదరాబాదులో జిహెచ్ఎంసి ఉద్యోగ సదస్సులో కెసిఆర్ పాల్గొని ప్రసంగించారు. వలస పాలనలో జిహెచ్ఎంసిలో వంద శాతం తెలంగాణ వాళ్లు ఉండాల్సి ఉండగా పది శాతం కూడా లేరన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి ఆరవయ్యేళ్లు దాటినా ఇంకా తెలంగాణ ప్రజల కష్టాలు పోలేదన్నారు. వలస పాలన ముఖ్యమంత్రులు, మంత్రులు తెలంగాణ వాళ్లని మనుషుల్లా చూడటం లేదన్నారు. అందుకే తెలంగాణవ్యాప్తంగా అసంతృప్తి, అసహనం ఉందన్నారు. జిహెచ్ఎంసి ఉద్యోగులకు నాలుగు వేల రూపాయల జీతం మాత్రమే వస్తుందని అది నగర జీవితంలో సరిపోదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి నాలుగు వేలతో బతికి చూపించాలన్నారు.

జిహెచ్ఎంసిలో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్‌గా మార్చాలని డిమాండ్ చేశారు. శుభ్రం చేసే దగ్గర తెలంగాణ వాళ్లు ఉంటే బంగ్లాలో ఆంధ్రా అధికారులు ఉంటున్నారన్నారు. తెలంగాణ తప్పకుండా వచ్చి తీరుతుందన్నారు. తెలంగాణలో అన్ని వనరులు ఉన్నప్పటికీ వలసవాద పాలనలో ఏమీ లేనట్లుగా తయారయిందన్నారు. నగరంలో 12మంది అడిషనల్ కమిషనర్‌లు ఉంటే తెలంగాణకు చెందిన వారు ఒక్కరే ఉన్నారన్నారు. కాంట్రాక్టులు, ఔట్ సోర్సింగులు కూడా ఆంధ్రావారివే అన్నారు. ప్రభుత్వం జిహెచ్ఎంసిలో తెలంగాణ కార్మికల వెతలు తీర్చకుంటే 7వ తేదినుండి సహాయ నిరాకరణ చేపడతామని హెచ్చరించారు.

English summary
TRS president K Chandra Sekhar Rao accused government stand at GHMC employees meeting. He said 90 percent of employees are from Andhra, he promised them hundred percent employees from Telangana after separation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X