వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ అంశం సున్నితమైంది, ఏకాభిప్రాయానికి ప్రయత్నాలు: ప్రధాని

By Pratap
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
న్యూఢిల్లీ: తెలంగాణ అంశం చాలా సున్నితమైందని, ఏకాభిప్రాయంతోనే సమస్య పరిష్కారమవుతుందని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు. తన నివాసం నుంచి మీడియా ప్రతినిధులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన సోమవారం వివిధ ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తెలంగాణ చాలా జటిలమైందని, సంప్రదింపుల ద్వారా ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. ఏకాభిప్రాయం వరకు వచ్చే వరకు సంప్రదింపులు కొనసాగుతాయని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపడం ద్వారా పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. ఏకాభిప్రాయం రాకపోతే అనే ఊహాజనితమైన ప్రశ్నకు సమాధానం ఇవ్వలేమని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఇప్పటికే కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం తొలి విడత అఖిల పక్ష సమావేశం నిర్వహించారని, మరో సమావేశం నిర్వహిస్తారని ఆయన చెప్పారు.

రాబోయే ఎన్నికల గురించి మాట్లాడడం తొందరపాటే అవుతుందని, భవిష్యత్తు ప్రధాని ఎవరనేది మాట్లాడడం కూడా తొందరపాటే అవుతుందని ఆయన అన్నారు. తమ భాగస్వామ్య పక్షాలన్ని తమతోనే ఉన్నాయని, యుపిఎ ప్రభుత్వం పటిష్టంగా ఉందని ఆయన చెప్పారు. తాను రాజీనామా చేయాలని అనుకోలేదని, రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. తమ సంకీర్ణ ప్రభుత్వం బలంగానే ఉందని ఆయన చెప్పారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తర్వాత మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ జరుగుతుందని ఆయన చెప్పారు. అవినీతి వ్యవహారాల్లో దోషులకు శిక్ష పడాలనేదే తమ అభిమతమని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం సంస్కరణలకు కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. ప్రతిపక్షాల సహకారం లేకపోవడంతో అనుకున్నవన్నీ చేయలేకపోతున్నామని ఆయన చెప్పారు.

English summary
Prime Minister Manmohan Singh Said that Telangana issue is critical and Home Minister Chidambaram is holding meeting with political parties of Andhra Pradesh. He said Issue will be solved with consultations with political parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X