టిడిపి నిట్టనిలువునా చీలిపోయింది, ఎవరినీ పట్టించుకోను: నాగం జనార్ధన్ రెడ్డి

తెలంగాణ వ్యతిరేకి అయిన గవర్నర్ నరసింహన్ ప్రసంగాన్ని వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అడ్డుకుంటామని నాగం స్పష్టం చేశారు. ఆంధ్రా పాలకులు ఇప్పటికే చాలా దోచుకున్నారని ఇప్పటికైనా మా తెలంగాణ మాకు ఇచ్చి వెళితే బావుంటుందని సూచించారు. తెలంగాణ కోసం ఎవరి గురించి ఆలోచించవలసిన అవసరం లేదన్నారు.
సహాయ నిరాకరణ చేస్తున్న ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే సర్కారు భరతం పడతామని హెచ్చరించారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రధానిని, కేంద్రాన్ని తెలంగాణకు ఒప్పించిన తర్వాతే హైదరాబాద్ తిరిగి రావాలన్నారు. సీమాంధ్ర నేతలు ఇక్కడి నుండి వెళ్లిపోయి జై ఆంధ్ర ఉద్యమం చేసుకుంటే బావుంటుందని సూచించారు.












Click it and Unblock the Notifications