ప్రభుత్వం ఏం చేసినా తెలంగాణ ప్రజల్లో మేం హీరోలమే: హరీష్ రావు

సెన్సార్ చేసిన వీడియో ఫుటేజ్‌లను మాత్రమే మీడియాకు విడుదల చేశారని, మొత్తాన్ని విడుదల చేసి ఉంటే మార్షల్స్ చేత తమపై ప్రభుత్వం ఎలా దాడి చేయించిందో కూడా తెలిసి ఉండేదని ఆయన అన్నారు. దీనిపై సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసు ఇస్తామని ఆయన అన్నారు. శాసనసభ దృశ్యాలను విడుదల చేయాలంటే బిఎసిలో చర్చించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. సభా సంప్రదాయాలను ప్రభుత్వం మంట కలిపిందని, శానససభను రాజకీయాలకు వాడుకుంటోందని ఆయన అన్నారు. కొన్ని మీడియా చానెళ్లకు మాత్రమే దాన్ని విడుదల చేశారని, కొన్ని చానెళ్లకు ఇప్పటి వరకు అందలేదని ఆయన చెప్పారు. సభలో ఏం జరుగుతుందో తెలియాలంటే ప్రత్యక్ష ప్రసారానికి అనుమతించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications