హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఢిల్లీ వెళ్లొచ్చాక రాజీనామా ఆలోచన: తెలంగాణ మంత్రుల నిర్ణయం!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana Ministers
హైదరాబాద్: తెలంగాణ అంశంపై కాంగ్రెస్ శాసనసభ్యులు ఢిల్లీకి వెళ్లినట్లుగానే తాము వెళ్లాలని తెలంగాణకు చెందిన మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ విషయంపై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు తెలంగాణకు చెందిన మంత్రులు శనివారం మంత్రి జనారెడ్డి ఇంటిలో సమావేశం అయ్యారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. అధిష్టానాన్ని మరోసారి కలిసిన తర్వాత రాజీనామాల విషయంపై ఆలోచిస్తామని చెబుతున్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసి తెలంగాణపై శాశ్వత పరిష్కారం తీసుకోవాలని ఒత్తిడి తీసుకు వస్తామని చెప్పారు. ఈ విషయంపై ఢిల్లీకి వెళ్లే పయనం అయ్యే ముందు మరోసారి అధిష్టానానికి లేఖ రాసేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలో ఉద్యోగులు చేస్తున్న సహాయ నిరాకరణపై త్వరలో హై కమాండ్‌కు లేఖ రాస్తామని చెప్పారు. సహాయ నిరాకరణను విరమింపజేసేలా నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రానికి కట్టుబడి ఉందన్నారు. మేం తెలంగాణ తప్ప మరే పరిష్కారాన్ని ఆమోదించేది లేదని సీనియర్ నాయకులు కే కేశవరావు చెప్పారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత రాజీనామాలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

సమావేశంలో మంత్రి జానారెడ్డి రాజీనామా చేస్తానని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే మిగతా మంత్రులు తొందరపడి రాజీనామాలు చేయవద్దని వారించినట్లుగా తెలుస్తోంది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజీనామాలు చేసి పార్టీకి నష్టం కలిగించే ప్రయత్నాలు చేయవద్దని సూచించినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ కార్యక్రమంలో మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, జూపల్లి కృష్ణారావు, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, కె కేశవరావు తదితరులు పాల్గొన్నారు.

English summary
Telangana Minister were decided today to go New Delhi on Telangana issue soon. After Delhi tour they will decid on resignations. Telangana Ministers met today at Jana Reddy's residence for future planes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X