విజయ్ 'జన నాయగన్' లీక్ కేసులో బిగ్ ట్విస్ట్!

తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దళపతి విజయ్ కథానాయకుడిగా వస్తున్న చివరి చిత్రం 'జన నాయగన్' లీకేజీ వ్యవహారంలో పోలీసులు, సైబర్ క్రైమ్ విభాగం ఉమ్మడిగా భారీ చర్యలు చేపట్టాయి. ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన వీడియో క్లిప్‌లను వైరల్ చేసిన ఆరోపణలపై తాజాగా మరో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హై-ప్రొఫైల్ పైరసీ కేసులో పోలీసులు ఇప్పటికే పలువురిని కటకటాల వెనక్కి పంపగా.. రోజురోజుకూ విచారణ మరింత వేగవంతం అవుతోంది.

లీకైన ఫుటేజ్‌ను వైరల్ చేసిన వారిపై కఠిన చర్యలు
'జన నాయగన్' సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు సోషల్ మీడియా, వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్‌లలో విపరీతంగా వైరల్ కావడంతో సైబర్ క్రైమ్ విభాగం రంగంలోకి దిగింది. నిందితులు చట్టవిరుద్ధంగా సినిమా కాపీరైట్ కంటెంట్‌ను వివిధ డిజిటల్ మార్గాల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా చేరవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడిన నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరికి ఈ ఫుటేజ్ అసలు ఎక్కడి నుంచి లభించింది? ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Thalapathy Vijay Jana Nayagan Leak Case Six More Arrested For Sharing Pirated Movie Clips

ఎడిటరే అసలు సూత్రధారి!
ఈ కేసులో పోలీసులు ఇంతకు ముందే ఉమా శంకర్ అనే ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ అసిస్టెంట్ ఎడిటర్ వేరే సినిమా ఎడిటింగ్ పనుల కోసం సదరు స్టూడియోకు వెళ్లగా.. అక్కడ యాదృచ్ఛికంగా 'జన నాయగన్' చిత్రానికి సంబంధించిన ఫుటేజ్ లభించింది. దాంతో అతను రహస్తంగా ఆ డేటాను దొంగిలించి.. పూర్తి సినిమాను సిద్ధం చేసి తన స్నేహితులకు, తెలిసిన వారికి షేర్ చేశాడు. ఆ తర్వాత అది కాస్తా పైరసీ వెబ్‌సైట్లలోకి చేరింది. నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత, ఐటీ యాక్ట్, కాపీరైట్ యాక్ట్ కింద తీవ్రమైన సెక్షన్లు నమోదు చేశారు. మద్రాస్ హైకోర్టు కూడా ఇతని ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడం గమనార్హం.

ఎప్పుడు లీక్ అయింది?
దళపతి విజయ్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ చివరి చిత్రం ఏప్రిల్ 9వ తేదీన ఆన్‌లైన్లో లీక్ కావడం అప్పట్లో చిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం రేపింది. సినిమా లీక్ అయిన వెంటనే మేకర్స్ 'కేవీఎన్ ప్రొడక్షన్స్' లీగల్ టీమ్ అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా, ఎవరైనా ఈ సినిమా సీన్స్, ఫోటోలు లేదా పూర్తి చిత్రాన్ని డౌన్‌లోడ్ చేసినా, షేర్ చేసినా, రీ-పోస్ట్ చేసినా ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని, కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని ప్రొడక్షన్ హౌస్ పబ్లిక్ నోటీసు ద్వారా గట్టి హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా జరిగిన ఈ అరెస్టులు సినిమా ఇండస్ట్రీలో పైరసీకి పాల్పడే వారికి ఒక బలమైన హెచ్చరికగా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+