వాస్తు ప్రకారం మనీప్లాంట్ ఉంటే డబ్బు వస్తుంది.. కానీ ఈ తప్పులు చేయొద్దు!

ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే ఐశ్వర్యం కలిసి వస్తుందని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. వాస్తు శాస్త్రం ప్రకారం కూడా మనీ ప్లాంట్ అదృష్టాన్ని, సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. అయితే, ఈ మొక్కను కేవలం ఇంట్లో పెట్టేస్తే సరిపోదు.. దాన్ని పెంచే విధానంలో కొన్ని కఠినమైన నియమాలను పాటించాలని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన నియమాలు పాటించకపోతే లాభానికి బదులు తీవ్ర నష్టాలు తప్పవు. మనీ ప్లాంట్ ద్వారా మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవించాలంటే పాటించాల్సిన ముఖ్యమైన సూత్రాలు ఇవే.

దిశ చాలా ముఖ్యం: ఈ రెండు దిక్కులే శ్రేష్ఠం!
మనీ ప్లాంట్‌ను ఎక్కడ పడితే అక్కడ పెంచకూడదు.
దీని కోసం వాస్తు శాస్త్రం కేవలం రెండు దిశలను మాత్రమే సిఫార్సు చేస్తోంది.
వంటగది వైపు ఉండే మూలకు అధిపతి వినాయకుడు,
అలాగే శుక్ర గ్రహం. ఇక్కడ మనీ ప్లాంట్ ఉంచడం వల్ల సంపద విపరీతంగా పెరుగుతుంది.
వాయువ్య మూల ఈ దిశ కూడా మనీ ప్లాంట్ పెంచడానికి అనుకూలమైనదే.
మనీ ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశాన్యం లేదా నైరుతి దిశల్లో పెట్టకూడదు.
తప్పుడు దిశలలో పెడితే కుటుంబంలో నిత్యం గొడవలు, భారీ ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి.

Vastu According to principles keeping a money plant attracts wealth but avoid making these mistakes

కుండీ లేదా సీసా రంగు: 'ఎరుపు' కే ప్రాధాన్యత
మనీ ప్లాంట్‌ను మట్టిలో పెంచినా లేదా నీటిలో పెంచినా
పాత్ర రంగు విషయంలో జాగ్రత్త వహించాలి.
ఈ మొక్కను ఎల్లప్పుడూ ఎర్రటి రంగు కుండీలో లేదా
ఎరుపు రంగు గాజు సీసాలో మాత్రమే ఉంచాలి.
ఎరుపు రంగు ఆ ప్రదేశంలోని శక్తిని మరింత రెట్టింపు చేసి,
లక్ష్మి కటాక్షం త్వరగా లభించేలా చేస్తుంది.

మొక్క పైకి పాకాలి.. కిందకు వేలాడకూడదు!
చాలామంది ఇళ్లల్లో మనీ ప్లాంట్‌ను హ్యాంగింగ్ పాట్స్‌లో పెంచి,
దాని తీగలు కిందకు వేలాడేలా వదిలేస్తుంటారు.
వాస్తు ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు.
మనీ ప్లాంట్ కాండం ఎల్లప్పుడూ పైపైకి ఎదగాలి.
అందుకోసం ఒక స్టిక్ లేదా తాడు సహాయంతో తీగలను పైకి పాకించాలి.
పైకి ఎదిగే మొక్క.. ఆర్థిక ఎదుగుదలను, కొత్త అవకాశాలను సూచిస్తుంది.
తీగలు నేలకు వాలడం లేదా కిందకు వేలాడటం వల్ల
సంపద హరించుకుపోతుందని, అదృష్టం దురదృష్టంగా
మారుతుందని వాస్తు నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఎనర్జీని లాగేసుకునే గుణం
మనీ ప్లాంట్‌కు తన చుట్టుపక్కల ఉన్న శక్తిని గ్రహించే గుణం ఎక్కువగా ఉంటుంది.
ఇది పరిసరాల్లోని సానుకూల లేదా ప్రతికూల శక్తులను పీల్చుకుని బలంగా మారుతుంది.
ఒకవేళ దీనిని పెరట్లో ఏదైనా పెద్ద చెట్టుకు పాకించాలనుకుంటే..
ఆ చెట్టు కూడా ఆగ్నేయ లేదా వాయువ్య దిశల్లో ఉన్న బలమైన చెట్టు అయి ఉండాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+