పాక్ ఉగ్రవాది కసబ్‌కు ఉరిశిక్షను ఖరారు చేసిన బొంబాయి హైకోర్టు
National
oi-Pratapreddy
By Pratap
|
ముంబై: ముంబై దాడుల కేసులో నిందితుడు అజ్మల్ కసబ్‌కు బొంబాయి హైకోర్టు సోమవారం ఉరిశిక్షను ఖరారు చేసింది. కసబ్‌కు తొమ్మిది నెలల క్రితం ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష వేసింది. ప్రత్యేక కోర్టు వేసిన ఉరిశిక్షను బొంబాయి హైకోర్టు సమర్థించింది. హైకోర్టు తీర్పుపై కసబ్ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. మరణశిక్షకు వ్యతిరేకంగా కసబ్ పెట్టుకున్న అపీల్‌ను హైకోర్టు తోసిపుచ్చింది.
కసబ్ సోమవారం ఉదయం తీర్పునకు ముందు నిద్ర లేచి ఆర్థర్ రోడ్డు జైలులో ప్రార్థనలు చేసి, పవిత్ర ఖురాన్‌ను పఠించాడు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కసబ్ కోర్టు హాలులో కనిపించాడు.
Bombay high court has upheld the death sentence to Pakistani terrorist Mohammed Ajmal Kasab. The court has upheld the trial court verdict. Earlier on judgement day, Kasab got up in the morning, offered prayers and recited verses of the Holy Quran in his cell at Arthur Road Jail.
Story first published: Monday, February 21, 2011, 11:37 [IST]