వైయస్ జగన్ దీక్షపై కామెంట్స్‌కు చంద్రబాబుపై జయసుధ ఫైర్

Jayasudha
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శానససభ్యురాలు జయసుధ, ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యురాలు శోభానాగిరెడ్డి ధ్వజమెత్తారు. విద్యార్థుల కోసం వైయస్ జగన్ దీక్ష చేస్తుంటే చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని జయసుధ సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఏ ప్రాంతానికి చెందినవారైనా విద్యార్థులంతా ఒక్కటేనని, వైయస్ జగన్ వంటి నాయకుడు కావాలని వారు కోరుకుంటున్నారని ఆమె అన్నారు. చంద్రబాబు అనవసరంగా రాజకీయం చేస్తున్నారని ఆమె విమర్శించారు.

వైయస్ జగన్ విద్యార్థుల కోసం దీక్ష చేస్తుంటే ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని శోభా నాగిరెడ్డి అన్నారు. రాజకీయ లబ్ధి పొందడానికే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు. వైయస్ జగన్ దీక్షను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు ఎందుకు అడ్డుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు అనడాన్ని ఆమె వ్యతిరేకించారు. వైయస్ జగన్‌కు, తెరాస నాయకులకు మధ్య రహస్య అవగాహన కుదిరిందని అనడం తెలుగుదేశం నాయకుల అవివేకమని ఆమె అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+