వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మార్షల్స్‌ను ఛేదించుకొని అసెంబ్లీలోకి అడుగు పెట్టిన రేవంత్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Revanth Reddy
హైదరాబాద్: గవర్నర్ నరసింగన్ ప్రసంగాన్ని అడ్డుకొని అసెంబ్లీనుండి వారం రోజులు సస్పెండ్ అయిన తెలుగుదేశం పార్టీ శాససనభ్యుడు రేవంత్ రెడ్డి సోమవారం అసెంబ్లీలోకి వెళుతున్న సమయంలో మార్షల్స్ ఆయనను అడ్డుకోవడంతో మార్షల్స్‌కు, టిడిపి ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అసెంబ్లీలోనికి వెళుతున్న రేవంత్ రెడ్డిని మార్షల్స్ అడ్డుకున్నారు. సస్పెన్షన్‌కు గురి అయినందున లోనికి అనుమతించేది లేదని అన్నారు. దీంతో టిడిపి ఎమ్మెల్యేలు మార్షల్స్‌తో వాగ్వాదానికి దిగారు. అసెంబ్లీ రూల్స్ తెలుసా అని ప్రశ్నించారు. చీఫ్ మార్షల్స్ సైతం వద్దని వారించడంతో రేవంత్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి చీఫ్ మార్షల్స్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగారు.

ఎంతకీ అనుమతించక పోవడంతో టిడిపి తెలంగాణ ఎమ్మెల్యేలు మార్షల్స్‌ని చేధించుకొని లోనికి వెళ్లారు. మార్షల్స్‌తో తమతో ప్రవర్తించిన తీరుపై రేవంత్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఫిర్యాదు చేశారు. ఒక ఎమ్మెల్యేను అసెంబ్లీ గేటు వద్ద అడ్డుకోవడం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని అన్నారు.

English summary
Marshals obstructed suspended TDP MLA Revanth Reddy at assembly main gate today. TDP Telangana MLAs took Revanth Reddy in to assembly after long struggle. Revanth Reddy gave a complaint to Deputy speaker against marshals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X