హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాల్పులతో దద్దరిల్లుతున్న ఉస్మానియా, విద్యార్థుల రాళ్ల వర్షం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Osmania University
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం మరోసారి సోమవారం కాల్పులు, రాళ్ల వర్షాలతో దద్దరిల్లింది. సోమవారం అసెంబ్లీని ముట్టడిస్తామని ప్రకటించిన విద్యార్థులు తమతమ వ్యూహాలతో అసెంబ్లీ ముట్టడికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులు రెండు సమూహాలుగా చీలిపోయి ఒక సమూహం ఉస్మానియా ప్రధాన గేటు వద్దకు రావడంతో పోలీసులు గేట్లు మూసివేసి వారిని అడ్డుకున్నారు. మరో సమూహం మహిళా హాస్టల్ పక్కనుండి అడిక్‌మెట్ మీదుగా అసెంబ్లీకి వెళ్లడానికి సిద్ధపడ్డారు. పోలీసులకు, విద్యార్థులకు తోపులాట జరిగింది. విద్యార్థులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పోలీసులు రబ్బరు బుల్లెట్లతో ఫైరింగ్ చేశారు. ఈ కాల్పుల్లో ఒక విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. నిజాం హాస్టల్ వద్ద కూడా విద్యార్థులు పోలీసులపైకి విద్యార్థులు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.

విద్యార్థులు జామై ఉస్మానియా రైల్వే స్టేషన్‌లో ఓ రైలు బోగీకి నిప్పు పెట్టారు. నెక్లస్ రోడ్డు రైల్వే స్టేషన్‌ను ధ్వంసం చేశారు. రిజర్వేషన్ కౌంటర్‌ను పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో రైల్వే శాఖ ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలను బంద్ చేసింది. బుకింగ్ కౌంటర్‌ను మూసివేసింది. కాగా తెలంగాణకు చెందిన పలువురు లాయర్లు రాజ్ భవన్‌కు ముట్టడికి ర్యాలీగా బయలు దేరారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని, వెంటనే తెలంగాణ ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. లాయర్లను ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ వద్ద అరెస్టు చేశారు. కాగా మంగళవారం, బుధవారం జరిగే పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఉస్మానియా రిజిస్ట్రార్ ప్రకటించారు.

English summary
Tension prevailed again in Osmania University premises with police firing and students stone pelting incidents on monday. Police fired and lathi charged on students while they rallied for chalo assembly. Students destroyed Jamai Osmania and Necklace Road railway stations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X