హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విద్యార్థుల చలో అసెంబ్లీ ఉద్రిక్తం, లాఠీచార్జ్: గద్దర్ అరెస్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gaddar
హైదరాబాద్: విద్యార్థులు సోమవారం తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థులు విడిపోయి వేరువేరుగా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నాలు చేశారు. అయితే విద్యార్థుల ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల వద్ద రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు రెండు భాగాలుగా విడిపోయి, ఒకరు మహిళా హాస్టల్ పక్క దారిగుండా అడిక్‌మెట్ మీదుగా అసెంబ్లీకి చేరుకోవాలని ప్రయత్నాలు చేశారు. అయితే పోలీసులు వారని ఫ్లైఓవర్ వద్ద అడ్డుకున్నారు. దీంతో ఇటు పోలీసులు, విద్యార్థులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. విద్యార్థులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఓ సమయంలో పోలీసులు తప్పని సరి పరిస్థితుల్లో బాష్పవాయువు ప్రయోగించారు. హైదరాబాదు ట్యాంక్ బండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి విద్యార్థుల ర్యాలీకి బయలుదేరిన ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసులు సాధ్యమైనంతంగా హింసాయత్నాలు లేకుండా విద్యార్థులను అడ్డుకునే వ్యూహంలో భాగంగా సాధ్యమైనంత ఎక్కువమంది పోలీసులను మోహరించారు. మరో విద్యార్థి భాగం మహిళా హాస్టల్ మీదుగా మెయిన్ గేటు వద్దకు చేరుకున్నారు. పోలీసులు గేటు మూసివేసి విద్యార్థులను అడ్డుకున్నారు. పోలీసులు రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. దీంతో ఓ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులు పోలీసులు గోబ్యాక్, జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. ఎన్‌సిసి గేటు వద్ద విద్యార్థినుల ర్యాలీనీ పోలీసులు అడ్డుకున్నారు.

కాగా యూనివర్శిటీనుండి బయలుదేరితే పోలీసులు అడ్డుకుంటారనే వ్యూహంలో భాగంగా విద్యార్థులు ముందుగానే కొందరు బయటకు వెళ్లి అసెంబ్లీ ముట్టడికి బయలు దేరారు. బషీర్‌బాగ్ నుండి కాకతీయ యూనివర్శిటీ విద్యార్థులు సుమారు 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే సిఎం క్యాంప్ కార్యాలయం వద్ద కూడా పలువురు విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. నిజాం కళాశాల హాస్టల్ నుండి సైతం బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకొని వదిలి వేశారు.

English summary
Students Chalo Assembly created tension today. Telangana Political JAC chairman Kodandaram begin chalo assembly rally today at OU arts college. Students rallied to assembly. Police obstructed students at NCC gate and Adikmet fly over.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X