కెసిఆర్ రెచ్చగొడుతున్నారు, తెలంగాణ ఖాయం: ఎంపీ సర్వే

తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని చెప్పి తెలంగాణ కోరాలని ఇప్పటి వరకు చెప్పామని అయితే కెసిఆర్ మాత్రం అలా చేయలేదన్నారు. కెసిఆర్ కలిసి వచ్చినా కలిసి రాకున్నా తెలంగాణ తెచ్చేది మేం అని, ఇచ్చేది మా పార్టీ అన్నారు. మా సహనాన్ని పరీక్షించ వద్దని కెసిఆర్‌ను హెచ్చరించారు. ఢిల్లీలో ఏం మాట్లాడకుండా, రాష్ట్రంలో మాత్రం అందరినీ రెచ్చగొడుతూ అక్కడ హీరో అవుతూ, మమ్మలను విలన్లను చేద్దామని కెసిఆర్ అనుకుంటున్నారు. అయితే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను, సోనియాగాంధీని నమ్ముతున్నారన్నారు. కాంగ్రెస్ నేతలను తిడితే బావుండదని హెచ్చరించారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకే కేసిఆర్ ఉద్యమం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications