అసెంబ్లీలోకి దూసుకెళ్లిన విద్యార్థులు, పోలీసులతో ఘర్షణ

పూర్తి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా పోలీసు బలగాలను అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పెట్టినప్పటికీ అంతమంది విద్యార్థులు అసెంబ్లీలోకి దూసుకు పోవడంతో పోలీసులు చేష్టలుడిగి పోయారు. కాగా అసెంబ్లీ ముట్టడిని పోలీసులు అడ్డుకోవడంతో రెచ్చిపోయిన విద్యార్థులు రాజధానిలో సుమారు 8 బస్సులను ధ్వంసం చేశారు. హబ్సిగూడలో 8 బస్సులను ధ్వంసం చేసి ఒక బస్సుకు నిప్పు పెట్టారు. రామాంతాపూర్‌లో కూడా మరో బస్సును ధ్వంసం చేశారు. కొందరు విద్యార్థులు తార్నాకలోని వరుణ్ మోటార్ దుకాణం అద్దాలను ధ్వంసం చేశారు.












Click it and Unblock the Notifications