ప్రముఖ తెలుగు సినీ నటుడు మిక్కిలినేని రాధాకృష్ణ కన్నుమూత
State
oi-Pratapreddy
By Pratap
|
విజయవాడ: ప్రముఖ సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి (96) మంగళవారం తెల్లవారుజామున విజయవాడలో కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మూడు రోజుల నుంచి వెంటిలేటర్ ద్వారా చికిత్స పొందుతూ మృతిచెందారు. మిక్కిలినేని స్వగ్రామం కృష్ణాజిల్లా కోలవెన్ను మండలానికి చెందినవారు. నాటక రంగం అనుభవం ఉన్న ఆయన 1949లో దీక్ష సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు.
ఐదు దశాబ్దాలపాటు సినీరంగంలో సాంఘిక, జానపద, పౌరాణిక పాత్రలను పోషించిన ఆయన సుమారు 340 చిత్రాలలో నటించారు. భైరవద్వీపం ఆయన చివరి చిత్రం. మిక్కిలినేని భౌతిక కాయాన్ని విజయవాడ మొగల్రాజపురంలోని ఆయన స్వగృహంలో ఉంచారు. ఆయన మృతి వార్త తెలియగానే పలువురు రాజకీయ నేతలు, సినీరంగ ప్రముఖులు మిక్కిలినేని మృతికి సంతాపం తెలుపుతూ, కుటుంబసభ్యులను పరామర్శించారు.
Eminent Telugu cine actor Mikkilineni Radhakrishna Murthy passed away due to ill health at Vijayawada. He acted in more than 340 films. He belongs to Krishna district.
Story first published: Tuesday, February 22, 2011, 16:06 [IST]