ఎమ్మెల్సీ ఎన్నికలపై చిరంజీవితో డి. శ్రీనివాస్ మంతనాలు

Chiranjeevi
హైదరాబాద్‌: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవితో మంతనాలు జరిపారు. మంగళవారం రాత్రి చిరంజీవి ఇంటికి వచ్చిన శ్రీనివాస్‌ ఆయనతో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా చేజారకుండా చూసుకోవాలని ఈ ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. రెండు పార్టీల శాసనసభ్యులు, నాయకులు సమన్వయంతో వ్యవహరించాలని భావించారు. కాంగ్రెస్‌లో ప్రరాపా విలీన ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడుకున్నారు. ఎమ్మెల్యేల కోటాలో ప్రజారాజ్యం పార్టీకి అవకాశం వస్తుందని అంటున్నారు.

ఎమ్మెల్యే కోటానుంచి ఎమ్మెల్సీ పదవి దక్కించుకునేందుకు కాంగ్రెస్‌లో పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఈ కోటాలో పదవీవిరమణ చేస్తున్న ఆర్‌.గోపీనాథ్‌, చెంగల్రాయుడు, పాలడుగు వెంకట్రావు, మహ్మద్‌జానీ, కేబీ నారాయణప్పలు మళ్ళీ పదవి ఆశిస్తున్నారు. వీరంతా సీఎంని, పీసీసీ అధ్యక్షుణ్ణి కలిసి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. వీరు కాకుండా పలు జిల్లాలనుంచి నేతలు పెద్ద సంఖ్యలో పోటీపడుతున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి మహీధర్‌రెడ్డి, గొట్టిపాటి రవికుమార్‌, ఉగ్ర నరసింహారెడ్డి తదితర ఎమ్మెల్యేలు మంగళవారం సీఎంని కలిసి తమ జిల్లానుంచి ఎమ్మెల్యే కోటాలో మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్యకు అవకాశం ఇవ్వాలని కోరారు. తక్కువ సీట్లున్నాయని, పోటీ అధికంగా ఉందని, పరిశీలిస్తానని ఆయన హామీనిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+