హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై మారని బాబు మాట, రెండు ప్రాంతాల నేతలకు స్వేచ్ఛ

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలంగాణపై తన రెండు కళ్ల సిద్ధాంతాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి చెప్పారు. తమ తమ ప్రాంతాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేయాలని తాను రెండు ప్రాంతాల నాయకులకు స్వేచ్ఛ ఇచ్చానని, అందుకు అనుగుణంగా పనిచేస్తున్నామని, ఇందులో రాజీ లేదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెసు పార్టీ అని, కాంగ్రెసు పార్టీ నిర్ణయం తీసుకోకుండా తమ పార్టీని విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. వైయస్ జగన్ శిబిరంతో పాటు పార్టీలన్నీ తమ పార్టీని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని, ఈ స్థితిలో తమ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం తమకు ఉందని ఆయన అన్నారు.

కాంగ్రెసు పార్టీ ప్రజారాజ్యం పార్టీని కలుపుకుందని, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ను కలిపితే తెలంగాణ ఇస్తామని కాంగ్రెసు పార్టీ వారు అంటున్నారని, రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెసు పనిచేస్తోందని, సమస్యను పరిష్కారం చేసే ఉద్దేశంతో లేదని ఆయన అన్నారు. ప్రతి రాజకీయ పార్టీ రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. ఇతర రాజకీయ పార్టీలపై దాడి చేయడం అన్యాయమని ఆయన అన్నారు. చెప్పుకునే అవకాశమే లేదా అని ఆయన అడిగారు. పార్టీలు తమ తమ సిద్ధాంతాల ప్రకారమే నడుస్తాయని ఆయన అన్నారు. వైయస్ జగన్‌తో తెరాస అధ్యక్షుడు కెసిఆర్ కుమ్మక్కయ్యారని, పరస్పరం ప్రశంసించుకుంటున్నారని ఆయన అన్నారు. ఎందుకు కెసిఆర్ జగన్‌ను ప్రశంసిస్తున్నాడో తెలియదని ఆయన అన్నారు.

తెలంగాణను, హైదరాబాదును అభివృద్ధి చేసింది తమ ప్రభుత్వమేనని ఆయన చెప్పుకున్నారు. రాష్ట్రాభివృద్ధికి తాము తీసుకున్న చర్యల ఫలితాలు అంది వస్తున్న తరుణంలో కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఆ తర్వాత రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిందని ఆయన అన్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఇష్టప్రకారం దోచి పెట్టాడని ఆయన ఆరోపించారు. అంతర్జాతీయ కన్సల్టెన్సీలతో ఒప్పందాలు, ఆస్తుల అమ్మకం, ఖనిజ సంపదను దోచి పెట్టడం, జలయజ్ఞం ద్వారా రాష్టాన్ని దోచి పెట్టారని ఆయన ఆరోపించారు. సమస్యలను పట్టించుకునేవారే లేరని ఆయన అన్నారు.

English summary
Telugudesam president N Chandrababu Naidu reiterated his stand on Telangana issue. He opined that Congress should take action on Sri krishna committee report. He said that as all the parties including YS Jagan are targeting his party, he gave freedom to his party leaders of two regions to act according to the public opinion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X