మమతా బెనర్జీ రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు, 57 వేల కోట్ల ప్రణాళిక

దేశ ఆర్థికవృద్ధి కంటే రైల్వే వృద్ధి శాతం ఎక్కువగా ఉందన్నారు. ఏకగవాక్ష విధానం ఇప్పటికే అమలులోకి తీసుకు వచ్చామని చెప్పారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రైల్వే ప్రగతి ఉంటుందన్నారు. ప్రైవేటు, ప్రభుత్వం భాగస్వామ్యంలో ఈ ఏడాది 85 ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. 20-20 విజన్‌లో భాగంగా కొత్త కోచ్‌ల నిర్మాణం ఉంటుందని చెప్పారు. ప్రమాదాల సాకును చూపి రైల్వే శాఖపై విమర్శలు చేయడాన్ని ఆమె ఖండించారు. పరిమిత వనరుల దృష్ట్యా అన్ని డిమాండ్లు తీర్చుతామని హామీ ఇచ్చారు.
రైల్వే లోకో మోటివ్ కర్మాగారాల నిర్మాణం పురోగతిలో ఉందని చెప్పారు. పేదలకు 25 రూపాయలతో 100 కి.మీ. ఉచిత ప్రయాణం కల్పించారు. ఈ సంవత్సరం రైల్వే వార్షిక బడ్జెట్ 57,630 కోట్లుగా చెప్పారు. ప్రయాణీకుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరిన్ని బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇంపాల్ రైల్వే పరిధిని విస్తరిస్తామని చెప్పారు. రైల్వే ప్రమాదాల శాతం తగ్గిందని చెప్పారు. 0.17 శాతానికి రైల్వే ప్రమాదాలు తగ్గినట్లు చెప్పారు. గతేడాది కుట్రల వల్ల జరిగిన ప్రమాదాల్లో 261 మంది మరణించారని తెలిపారు. ఈ సంవత్సరాంతానికి అన్ని రైల్వే గేట్ల వద్ద కాపలాదారులను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
రైళ్ల నిలిపివేతల వల్ల ప్రజలకు, ప్రభుత్వం ఆదాయలకు గండి పడుతుందన్నారు. రైల్ రోకో ఆందోళనలు వద్దని ఆమె ప్రజలను కోరారు. పిఎం రైల్ వికాస్ ద్వారా రైల్వే విప్లవం వచ్చిందన్నారు. గత ఏడాది ఆందోళనల కారణంగా 3500 సర్వీసులు రీషెడ్యుల్ అయ్యాయని, మరో 1500 రైళ్లు రద్దయినట్లు చెప్పారు. ఇంధన పొదుపులో రైల్వే ముందు వరుసలో ఉందన్నారు. రైల్వేలోని అన్ని విభాగాల్లో పునర్వవస్థీకరణ ఉంటుందన్నారు. పన్ను రాయితీ ద్వారా రూ.10వేల కోట్ల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. రైల్వే ఆదాయం లక్షకోట్ల మార్కు దాటిందని చెప్పారు.
- 2011-12 సంవత్సర వార్షిక ప్రణాళిక రూ.57,630 కోట్లు
- 2011-12 సంవత్సరానికి మార్కెట్ రుణాలు రూ. 2,059 కోట్లు
- రాయ్‌బరేలీలో కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం, మూడు నెలల్లో తొలి ఉత్పత్తి
- కోల్‌కతా మెట్రో రైల్ కోసం సింగూర్‌లో కొత్త కోచ్ ఫ్యాక్టరీ
- మణిపూర్‌లో డీజిల్ లోకో మోటివ్ నిర్మాణం
- జమ్మూ-కాశ్మీర్‌లో రైల్వే వంతెనల నిర్మాణ కర్మాగారం
- మహారాష్ట్ర టాకూరులో 700 మెగావాట్ల సహయ వాయు ఆధారిత విద్యుత్ ప్లాంట్
- నందిగ్రామ్‌లో రైల్వే పారిశ్రామిక వాడలు
- ముంబయి, చైన్నై, కోల్‌కతాలలో రైల్వే ట్రాక్ పక్కన నివసించే వారికి ఆవాసాలు
- వరంగల్ జిల్లా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ
- కొత్తగా ట్రాన్స్ మిషన్ ఫ్యాక్టరీలు
- మార్చి 2012 నాటికి 442 కొత్త రైల్వే స్టేషన్లు
- 582 రైల్వే స్టేషన్ల సామర్థ్యం పెంపు
- ప్రమాదాలు జరగని రాష్ట్రాలకు రెండుప్రత్యేక రైళ్లు
- రైలు ఆధారిత పరిశ్రమలు మరింత విస్తృతం
- రిజర్వేషన్ బుకింగ్ ఛార్జీల్లో 50 శాతం తగ్గింపు
- ఎసి రిజర్వేషన్ బుకింగ్ 40 శాతం నుండి 20 శాతానికి తగ్గింపు
- రెండో తరగతి బుకింగ్ 20 శాతం నుండి 10 శాతానికి తగ్గింపు
- రైల్వే ఉద్యోగుల్లో బలహీన వర్గాల వారికి విద్యకు రూ.1200 ఉపకార వేతనం
- పైలెట్ ప్రాజెక్టులుగా స్మార్టు కార్డులు
- 1.75 లక్షల బ్యాక్‌లాక్ ఖాళీల నియామకం
- మాజీ సైనికులకు 16వేల మందికి ఉద్యోగాలు
- రైల్వేలో ప్రత్యేక స్పోర్ట్స్ క్యాడర్
- రైల్వే రక్షక దళంలో 13వేల మంది నియామకం
- ప్రయాణీకుల భద్రత కోసం జాతీయస్థాయిలో కాల్ సెంటర్
- రైల్వే అనుసంధానంతో సామాజిక సాధన మార్పు
- కోల్‌కతా మెట్రో రైల్ విస్తరణ
- కోల్‌కతా మెట్రోలో 33 కొత్త రైళ్లు
- దక్షిణ మధ్య, దక్షిణ రైల్వేలకు త్వరలో ప్రమాద హెచ్చరిక పరికరాలు
- లక్నో, బెనారస్, బికనీర్, చెన్నై, ముంబయి, అహ్మదాబాద్, విశాఖ, భునవేశ్వర్, ఘోరక్ పూర్, లక్నో, జైపూర్, జమ్ము, తిరువనంత పురం, హుబ్లీ, అలహాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ, విశాఖ, తిరుపతి తదితర ప్రాంతాల్లో కొత్త రైల్వే లైన్లు పరిశీలన.