వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైల్వే బడ్జెట్: ప్రయాణికులపై మమత, రూ 25కే వంద కిమీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Mamata Banerjee
న్యూఢిల్లీ: రైల్వే చార్జీల్లో పెద్దగా మార్పు చేయకండా రైల్వే మంత్రి మమతా బెనర్జీ శుక్రవారం పార్లమెంటులో 2011-12 సంవత్సరానికి గాను రైల్వే బడ్జెట్‌ను ప్రతిపాదించారు. పేదలు 25 రూపాయలతో వంద కిలోమీటర్లు ప్రయాణించే అవకాశం కల్పించారు. ప్రమాదాల శాతం తగ్గిందని, 0.17 శాతం ప్రమాదాలు తగ్గాయని ఆమె చెప్పారు. పరిమిత వనరుల్లో అన్ని డిమాండ్లను తీర్చడానికి చూస్తున్నామని ఆమె చెప్పారు. కుట్రల కారణంగా నిరుడు ప్రమాదాల్లో 261 మంది మరణించినట్లు ఆమ తెలిపారు.

రూ. 57,630 కోట్లతో ఆమె రైల్వే వార్షిక బడ్జెట్‌ను ప్రతిపాదించారు. రైల్వే విపరీతమైన నష్టాల్లో ఉందని, నికర ద్రవ్యలోటు 2500 కోట్ల రూపాయలు ఉందని ఆమె చెప్పారు. 2012 సంవత్సరానికి రైల్వే 20,594 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటుందని ఆమె చెప్పారు. అన్ని రైల్వే క్రాసింగ్‌ల వద్ద కాపలాదారులను పెడుతామని ఆమె చెప్పారు. ప్రమాదాలు జరగని రాష్ట్రాలకు రెండేసి రైళ్లు ఇస్తామని ఆమ చెప్పారు. కొత్తగా 700 కిలోమీటర్ల లైన్లు వేయనున్నట్లు ఆమె తెలిపారు.

English summary
Railway Minister Mamata Banerjee presente Rail budget for the year 2011-12 with the outlay of Rs 57,630 crores. 
 
 There is no major changes in passenger fares. She said that railway is in huge loss.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X