హైదరాబాదులో దారుణం: భార్యను ముక్కలుగా నరికిన భర్త

పోలీసుల కథనం ప్రకారం - ఇటీవల అల్లూరయ్య పొప్పల్‌గుడాలోనిీ ఎల్‌ఎన్ఆర్ రెసిడెన్సీలో వాచ్‌మన్‌గా చేరాడు. తన భార్య మరో వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకుందని అల్లూరయ్య అనుమానించేవాడు. దీంతో ఇరువురి మధ్య తరుచుగా గొడవలు జరుగుతుండేవి. బుధవారం రాత్రి కూడా గొడవ జరిగింది. ఈ గొడవలో అల్లూరయ్య తన భార్య రమణమ్మను నరికి చంపాడు. రాత్రి 12 గంటల ప్రాంతంలో ఓ ఫ్లాట్ ఓనర్ వాచ్‌మన్ గది వద్ద శరీరభాగాలు పోగు చేసి ఉండడం గమనించి ఇతర ఫ్లాట్ యజమానులకు చెప్పాడు. అపార్టుమెంట్ కార్యదర్సి సత్యనారాయణ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న అల్లూరయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు.