హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎంపీలను చూసి బుద్ధి తెచ్చుకోండి: మంత్రులకు నాగం సూచన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు, మంత్రులు తెలంగాణ కోసం ఎలా పోరాడాలో వారి పార్లమెంటు సభ్యులను చూసి బుద్ధి తెచ్చుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి శుక్రవారం అసెంబ్లీ 15 నిమిషాలు వాయిదా పడిన అనంతరం మీడియా పాయింట్ వద్ద విలేకరుల ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణలో గ్రామగ్రామాన విద్యార్థులు ప్రత్యేక రాష్ట్రం కావాలని నిరసనలు తెలియజేస్తున్నారన్నారు. ఉపాధ్యాయులు కూడా నిరసన తెలుపుతున్నారని వారందరికీ తెలుగుదేశం శ్రేణులు అండగా ఉండాలని టిడిపి తెలంగాణ ఫోరం తరఫున ఆయన విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సహాయ నిరాకరణ తొమ్మిదో రోజుకు చేరినప్పటికీ ప్రభుత్వం వారిని పట్టించుకోక పోవడం విచారకరమన్నారు. వారు జీతాలు పెంచమని అడగడం లేదని, ప్రత్యేక సదుపాయాలు కోరడం లేదన్నారు. వారు ప్రత్యేక తెలంగాణ అడుగుతున్నారన్నారు. చదువుకునే విద్యార్థులపై లాఠీఛార్జ్‌లు చేస్తూ, జైళ్లలో తోస్తూ పోలీసుల అండతో ప్రభుత్వం నెట్టుకొస్తుందన్నారు.

ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే ఈజిప్టు తరహా ఉద్యమం తెలంగాణలో వస్తుందన్నారు. తెలంగాణ కోసం పది జిల్లాలనుండి కోటి మంది తెలంగాణ ప్రజలు వచ్చి హైదరాబాద్‌ను పూర్తిగా దిగ్బంధించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కేంద్రం ప్రభుత్వం వెంటనే తెలంగాణపైన స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. తెలంగాణ మంత్రులు లేఖలు రాసినంత మాత్రాన ప్రత్యేక రాష్ట్రం రాదన్నారు. మంత్రులు కుర్చీలు వదిలి బయటకు రావాలన్నారు. పార్లమెంటులో కాంగ్రెసు ఎంపీల తీరును చూసి బుద్ది తెచ్చుకోవాలన్నారు. తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులు అంతా కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ కోసం ఒప్పించాలన్నారు.

English summary
TDP senior MLA Nagam Janardhan Reddy suggested congress MLAs and Minister to follow Congress MPs, how to protest in assembly. Nagam blamed central and state government on students and employees issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X