రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం: నామా నాగేశ్వరరావు

రాష్ట్రం నుండి 42 పార్లమెంటు సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నామని, అధికార పార్టీకి చెందిన వారే 32 మంది ఉన్నారని అయినప్పటికీ రాష్ట్రానికి న్యాయం చేయలేక పోతున్నారన్నారు. తెలంగాణకు చెందిన గుండు సుధారాణి తదితర ఎంపీలతో మూడు నెలల క్రితం మమతా బెనర్జీని కలిసి రాష్ట్రానికి, తెలంగాణకు న్యాయం చేయాల్సిందిగా కోరామని అయితే ఆమె అప్పుడు సానుకూలంగా స్పందించినప్పటికీ బడ్జెట్‌లో మాత్రం తీవ్ర అన్యాయం చేశారని వాపోయారు. మమతా బెనర్జీ రైల్వే బడ్జెట్ ఎన్నికల కోసం చేసిన ప్రయత్నంగా ఉంది కానీ, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా చేసినట్టు లేదని మరో ఎంపీ అన్నారు.
రైల్వే బడ్జెట్ చాలా బాగుందని ఎంపీ మంద జగన్నాధం అన్నారు. రాష్ట్రానికి గతంలోకంటే ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. 2012 మార్చి నాటికి పెద్దపల్లి - నిజామాబాద్ రైల్వే లైన్‌ను పూర్తి చేపిస్తామని మరో ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. వరంగల్ జిల్లాకు చెందిన రాజయ్య, బలరాంనాయక్, గుండు సుధారాణి వంటి వారు వరంగల్ జిల్లాలోని కాజీపేటలో రైల్వే బోగీ ఫ్యాక్టరీ కోసం బాగా ప్రయత్నాలు చేసి సాధించారన్నారు.