వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంద్ ఉద్రిక్తం: ఎమ్మెల్యే రాంరెడ్డిపై తెలంగాణవాదుల ఆగ్రహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

R Damodar Reddy
నల్గొండ: తెలంగాణ జెఏసి పిలుపు మేరకు నల్గొండ జిల్లా సూర్యాపేటలో చేపట్టిన బంద్ శుక్రవారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. టిఆర్ఎస్ నేతలపై గురువారం సూర్యాపేట శాసనసభ్యుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి వర్గీయుల దాడికి నిరసనగా తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి సూర్యాపేట బంద్‌కు పిలుపును ఇచ్చింది. బంద్ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కర్రలు, రాళ్లతో దాడికి తెగబడ్డారు. అయితే ఈ బంద్ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఇటు తెలంగాణవాదులు నగరంలో దుకాణాలను బలవంతంగా మూసివేయిస్తుండగా, ఎమ్మెల్యే అనుచరులు బలవంతంగా తెరిపిస్తున్నారు. దీంతో సూర్యాపేటలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టిజెఏసి బలవంతగా మూసి వేయించడం, ఎమ్మెల్యే అనుచరులు బలవంతంగా తెరిపించడంతో దుకాణ యజమానులకు ఎటూ పాలుపోని పరిస్థితి తయారయింది.

కాగా ఎమ్మెల్యే దామోదర్ రెడ్డి రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యే వర్గీయుల దాడిని, బంద్ అడ్డుకోవడాన్ని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఖండించారు. అయితే ఈ సంఘటనతో దామోదర్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకి అని మేం అనుకోవడం లేదని, అయితే కేవలం ఒక స్థానిక సంఘటనతో ఇంత ఉద్రిక్తత నెలకొనడం సరికాదన్నారు. అయితే సూర్యాపేటలో తెలంగాణ జెఏసికి మా మద్దతు ఉంటుందని ప్రకటించారు. రాంరెడ్డి వంటి తెలంగాణవాది నుండి ఇలాంటి సంఘటన మేం ఊహించలేదని కోదండరామ్ అన్నారు.

కాగా గురువారం ఓ సన్మాన కార్యక్రమం సందర్భంగా టిఆర్ఎస్ నేతలు రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఫ్లెక్సీని చించి వేశారు. ఫ్లెక్సీ చించినందుకు నిరసనగా ఎమ్మెల్యే వర్గీయులు టిఆర్ఎస్ దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేశారు. స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. టిఆర్ఎస్ నేతలు కూడా తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు నిరసన తెలియజేసేందుకు వచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాదులాట, తోపులాట నుండి కొట్టుకునే స్థాయికి వెళ్లింది. ఎమ్మెల్యే వర్గీయులు టిఆర్ఎస్ నేతలను దొరికిన వారిని దొరికినట్టుగా చితకబాదారు. దీంతో శుక్రవారం సూర్యాపేట బంద్‌కు జెఏసి పిలుపునిచ్చింది.

English summary
Clash took place between Telanganites and MLA Ramreddy Damodar Reddy followers. Tension at Suryapet of Nalgonda district due to clash between two groups. JAC chairman Kodandaram condemned MLA followers attack and he supported bandh. MLA Damodar Reddy also warned Telanganites.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X