తెలంగాణ రెండు రోజుల్లో తేలదు, సమయం కావాలి: మాజీ సిఎం రోశయ్య
Districts
oi-Srinivas G
By Srinivas
|
విజయవాడ: తెలంగాణ అంశం రెండు, మూడు రోజుల్లో తేలేది కాదని మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఆదివారం కృష్ణా జిల్లా గుడివాడలో అన్నారు. తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉందని ఆ సమస్యను సాధ్యమైనంత త్వరగా తేల్చడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని అన్నారు. తెలంగాణ అంశం రాష్ట్ర పరిధిలో ఉన్నది కాదని చెప్పారు. ఉద్యోగులు సహాయనిరాకరణ చేయడం మంచిది కాదని అన్నారు. వారు వెంటనే తమ సహాయ నిరాకరణను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సహాయ నిరాకరణ వల్ల రాష్ట్రానికి దెబ్బ అన్నారు. ప్రభుత్వానికి అందరూ సహకరించాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమాన్ని, దాని తీవ్రతను గుర్తించింది కాబట్టే శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. శ్రీకృష్ణ కమిటీ కూడా తన నివేదికను కేంద్రానికి సమర్పించిందని గుర్తు చేశారు. కేంద్రం ఇక నిర్ణయం తీసుకోనుందని, అయితే అది అనుకున్నంతనే అయ్యే పని కాదని అందరూ గుర్తుంచుకోవాలని కేంద్రానికి కాస్త సమయాన్ని ఇవ్వాలని కోరారు.
Former Chief Minister Konijeti Rosaiah said Telangana issue is not cleared in one or two days. He suggest Telanganites to give time to government. He urged employees to withdraw non co-operation.
Story first published: Sunday, February 27, 2011, 10:17 [IST]