విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒక్కరి కోసం నిర్ణయం సరికాదు: కెసిఆర్‌పై రాయపాటి పరోక్ష వ్యాఖ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rayapati Sambasiva Rao
విజయవాడ: తెలంగాణవాదులు ఆందోళనలు సృష్టించి సమస్యలు సృష్టిస్తే వారు కోరుకునే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాదని, కానీ రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉందని గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు ఆదివారం కృష్ణా జిల్లాలో హెచ్చరించారు. సహాయ నిరాకరణతో ప్రభుత్వ పనులు స్తంభింప చేయడం, బంద్‌లు, రాస్తారోకోలతో రాకపోకలు ఆపడాన్ని ఆయన వ్యతిరేకించారు. ఆందోళనలు సృష్టించినంత మాత్రాన తెలంగాణ రాదన్నారు. 2009 డిసెంబర్ 9న కేంద్రం ప్రభుత్వం చేసిన తెలంగాణ ప్రారంభ ప్రక్రియ స్టేట్ మెంట్ సరికాదన్నారు. ఈ విషయాన్ని తాను ఆర్థిక శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీకి కూడా తెలియజేశానని అన్నారు. ఒక వ్యక్తి కోసం తీసుకున్న నిర్ణయం సరియైనది కాదన్నారు.

సంకీర్ణ ప్రభుత్వాల వల్ల ప్రజలకు పూర్తిగా న్యాయం చేయలేక పోతున్నామని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సంకీర్ణ ప్రభుత్వాలలో ప్రజలకు న్యాయం జరగడం లేదన్నారు. ప్రజలకు న్యాయం చేయలేని మమ్మల్లి ఈసారి ఎన్నుకోవద్దని ఆయన ప్రజలకు కోరారు. ప్రజలకు న్యాయం చేయలేక తమను ఎన్నుకున్న ప్రజలముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందని ఆయన అన్నారు. రైల్వై బడ్జెట్‌లో గుంటూరు డివిజన్‌కు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రైల్వే మంత్రి మమతా బెనర్జీని అపాయింట్‌మెంట్ కోరినా ఇవ్వలేదని అన్నారు. రైల్వై బడ్జెట్‌లో తమకు అన్యాయం జరిగిందని రాయపాటి నిరసన తెలియజేశారు. రాష్ట్రంలో కేబినెట్ స్థాయ మంత్రులు లేక పోవడం వల్లే ఇలా జరగిందన్నారు.

English summary
Guntur Parliament Member Rayapati Sambasiva Rao suggested voters that to will not elect them in future elections. He said they are not making justice for voters by alliance government. He warned Telanganites, president rule will come if they organize agitations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X