హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ బిల్లు పెట్టించాలని సిఎంను కోరిన టిడిపి తెలంగాణ నేతలు

By Pratap
|
Google Oneindia TeluguNews

TDP Telangana leaders
హైదరాబాద్: పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు పెట్టించాలని తాము ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కోరినట్లు తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి చెప్పారు. తెలుగుదేశం తెలంగాణ ఫోరం నాయకులు సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. ఈ భేటీ అనంతరం జనార్దన్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రతిపాదించేలా చూడాలని, విడిపోయి కలిసుందామని చెప్పామని, బిల్లు పెట్టించి చరిత్రలో నిలిచిపోవాలని తాము ముఖ్యమంత్రిని కోరినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి ఏమన్నారని అడిగితే ఏమంటారంటూ నవ్వుకుంటూ నాగం వెళ్లిపోయారు.

గిర్‌గ్లానీ కమిటీ నివేదికను అమలు చేయాలని, ఉద్యోగ నియామకాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి విడుదలైన 610 జీవోను అమలు చేయాలని తాము ముఖ్యమంత్రిని కోరినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యోగుల ప్రమోషన్లను ఆపేయడం సరి కాదని, దానివల్ల 95 మంది ఉద్యోగులకు అన్యాయం జరిగిందని తాము ముఖ్యమంత్రికి చెప్పినట్లు ఆయన తెలిపారు. రేపటి రైల్ రోకోకు తాము సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు ఆయన తెలిపారు. తమ పార్టీ కార్యకర్తలు రైల్ రోకో కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన చెప్పారు. సహాయ నిరాకరణ చేస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకుంటే తాము సహించబోమని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు చెప్పారు.

English summary
TDP Telangana region MLAs met CM Kirankuamar Reddy and appealed to implement 610 GO to do justice to 
 
 Telangana staff. TDP Telangana Forum convenor said that they appealed to CM cooperate in proposing Telangana bill 
 
 in Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X