హైదరాబాద్: సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ మంత్రి బొత్స సత్యనారాయణకు కితాబునిచ్చారు. ఈస్ట్ కోస్ట్ థర్మల్ ప్రాజెక్టును అడ్డుకోవడానికి శ్రీకాకుళం జిల్లాలోని వట్టితాండ్ర తదితర గ్రామాల ప్రజలు భారీ ఎత్తిన ఉద్యమించగా పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. అందులో ఇద్దరు మరణించారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే కాకరాపల్లి విషయంలో మంత్రి బొత్స ప్రభుత్వం వైఫల్యం ఉందంటూ మంగళవారం మీడియా పాయింట్ వద్ద మీడియా ప్రతినిధులతో చెప్పారు. ప్రభుత్వం తన తప్పును ఒప్పుకున్నందుకు నారాయణ బొత్సకు బుధవారం ఫోన్ చేసి కితాబునిచ్చారు.
అయితే అదే సమయంలో బాధితులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. బాధితులపై అమానుషంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన బొత్సను కోరారు. తప్పు ఒప్పుకున్నందుకు అభినందనలు తెలుపుతూ బాధితులకు సహకరించాలని నారాయణ కోరారు. అమాయక ప్రజలపై పోలీసులు కేసులు పెట్టారని వారిపై కేసులు ఎత్తివేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఓ వృద్ధురాలిపై హత్యా కేసు పెట్టారని మంత్రి దృష్టికి తీసుకు వచ్చినట్టు తెలుస్తోంది.
CPI state secretary Narayana praised Minister Botsa Satyanarayana today for government its fault in kakarapalli of Srikakulam district firing. He urged minister Botsa to support the victims of police.
Story first published: Wednesday, March 2, 2011, 12:26 [IST]