సినిమాల్లో బోల్డ్ సీన్స్ వెనుక అసలు నిజాలు!

వెండితెరపై లేదా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో వచ్చే వెబ్ సిరీస్‌లలో రొమాంటిక్, ముద్దు సీన్లు చూసేటప్పుడు ప్రేక్షకులు రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. అయితే స్క్రీన్‌పై కనిపించే ఆ రొమాంటిక్ సీన్ల వెనుక ఎంతో మంది శ్రమ, పక్కా ప్లానింగ్, కఠినమైన నిబంధనలు ఉంటాయని బోల్డ్ నటి, ఇంటిమసీ కోఆర్డినేటర్ నేహాల్ వడోలియా వెల్లడించారు. ఒకప్పుడు 'తారక్ మెహతా కా ఉల్టా చష్మా' వంటి పాపులర్ ఫ్యామిలీ షోలతో పాటు పలు అడల్ట్ ఓటీటీ సిరీస్‌లలో నటించి మెప్పించిన ఆమె.. ఇప్పుడు సినిమాల్లో బోల్డ్ సీన్స్ పర్యవేక్షించే 'ఇంటిమేసీ కోఆర్డినేటర్'గా కొత్త కెరీర్ ప్రారంభించారు. ఇటీవల ఓ టాక్ షో లేదా పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న నేహల్.. తెర వెనుక ఇలాంటి సీన్లను ఎలా చిత్రీకరిస్తారనే ఆసక్తికరమైన నిజాలను విడమరిచి చెప్పారు.

నటీనటుల సౌకర్యం కోసం ఇంటిమసీ కోఆర్డినేటర్
నేహాల్ వడోలియా వెల్లడించిన వివరాల ప్రకారం.. నటీనటుల మధ్య బోల్డ్ లేదా రొమాంటిక్ సీన్లను చిత్రీకరించే సమయంలో దర్శకులు, నిర్మాతలు కచ్చితంగా ఇంటిమసీ కోఆర్డినేటర్ సహాయం తీసుకుంటారు. సెట్ లో వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చడానికి నటీనటులు ఎటువంటి సంకోచం లేకుండా సౌకర్యంగా ఫీల్ అవ్వడానికి వీరి పాత్ర కీలకం. షూటింగ్ సమయంలో అనవసరమైన వ్యక్తులను సెట్‌లోకి అస్సలు రానివ్వరు. దీనిని 'క్లోజ్డ్ సెట్' అంటారు. కేవలం దర్శకుడు, కెమెరామెన్, నటీనటులు ఎవరి సమక్షంలోనైతే ఇబ్బంది పడకుండా ఉంటారో, ఆ పరిమిత సిబ్బందిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఏ సీన్ అయినా పక్కా క్లారిటీతో, ఏ పరిమితి లోపు చేయాలో ముందే నిర్ణయించి అంతే పద్ధతిగా షూట్ చేస్తారు.

Intimacy Coordinator Nehal Vadoliya Explains How Bold And Kissing Scenes Are Shot In Movies

దర్శకుడి స్టోరీ ప్రకారమే షూటింగ్.. సొంత నిర్ణయాలకు నో!
వెబ్ సిరీస్‌లు లేదా సినిమాల్లోని ఇంటిమేట్ సీన్లను కోఆర్డినేటర్లు సొంతంగా రాయరు. కథాంశాన్ని బట్టి దర్శకులే ఈ సీన్లను ముందే స్క్రిప్ట్ రూపంలో రాసుకుంటారు. ఒక సీన్‌ను ఎలా పండించాలో, నటీనటుల బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలో పూర్తి బ్లూప్రింట్ సిద్ధం చేస్తారు. దాని ఆధారంగానే కోఆర్డినేటర్లు నటీనటులకు గైడ్ చేస్తూ సీన్లను పూర్తి చేయిస్తారు. అంతేకాదు ఇలాంటి బోల్డ్ సీన్లకు సాధారణంగా 'రీటేక్స్' ఉండవని నేహాల్ వడోలియా చెప్పారు. ఎందుకంటే ఇవి చాలా ప్రైవేట్ మూమెంట్స్ కాబట్టి నటీనటులు సహజంగానే కొంత అసౌకర్యానికి, టెన్షన్‌కు గురవుతారు. అందుకే మళ్లీ మళ్లీ కెమెరా ముందు ఆ సీన్ చేయాల్సి రాకూడదని, సింగిల్ టేక్‌లోనే పర్ఫెక్ట్‌గా పూర్తి చేయడానికి నటీనటులు తమ శాయశక్తులా ప్రయత్నిస్తారు.

ఆన్‌స్క్రీన్ ముద్దు సీన్ల వెనుక అసలు నిజం
ఆన్‌స్క్రీన్‌పై కనిపించే ముద్దు సీన్ల వెనుక ఉన్న అసలు సత్యాన్ని కూడా నేహాల్ వడోలియా ఈ సందర్భంగా వివరించారు. ముద్దు సీన్లు చేయడానికి, కథ డిమాండ్ మేరకు గ్లామర్ పండించడానికి మానసికంగా అంగీకరించే ఆర్టిస్టులు మాత్రమే అందులో నటిస్తారని ఆమె స్పష్టం చేశారు. "నిజ జీవితంలో గర్ల్‌ఫ్రెండ్, బాయ్‌ఫ్రెండ్ మధ్య ఉండే ముద్దుల లాగా ఆన్‌స్క్రీన్‌పై కెమెరా ముందు నడవదు. ఎందుకంటే తెరపై కిస్ చేయడం అనేది కేవలం మీ వృత్తిలో ఒక భాగం మాత్రమే. దానికి కొన్ని టెక్నిక్స్, యాంగిల్స్ ఉంటాయి" అని నేహాల్ వడోలియా పేర్కొన్నారు.

లీగల్ బౌండరీలు.. ఆర్టిస్టుల ఇష్టారాజ్యానికి తావుండదు..
స్క్రీన్‌పై కనిపించే ముద్దు సీన్లకు లేదా రొమాంటిక్ సన్నివేశాలకు ఓ స్పష్టమైన పరిమితి ఉంటుంది. నటీనటులకు తాము ఎక్కడ రొమాన్స్ ఆపాలో, ఎక్కడ కిస్ ముగించాలో ముందే స్పష్టమైన అవగాహన, హెచ్చరికలు ఇస్తారు. ఇందులో నటీనటులు తమ సొంత ఇష్టాయిష్టాల ప్రకారం లేదా మూడ్‌ని బట్టి ప్రవర్తించడానికి వీల్లేదు. ఓ నటుడు ఎక్కువ సమయం కిస్ చేయాలని అనుకున్నా లేదా తక్కువ సమయం చేయాలని భావించినా అక్కడ వారి పప్పులు ఉడకవు. ఒకవేళ ఎవరైనా పరిమితి దాటి ప్రవర్తిస్తే అది వేధింపుల కిందకు వస్తుంది. అందుకే కథలో ఎంతవరకు రాసి ఉందో, దర్శకుడు ఎంతవరకు డిమాండ్ చేశాడో.. నటీనటులు అంతవరకు మాత్రమే ప్రొఫెషనల్‌గా రొమాంటిక్ సీన్లలో నటించాల్సి ఉంటుందని నేహాల్ వడోలియా వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+