హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ అంశం: అధిష్టానంపై దామోదర్ రెడ్డి ధిక్కారం

By Srinivas
|
Google Oneindia TeluguNews

R Damodar Reddy
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై ఓపిక పట్టాల్సిన అవసరం మాకు ఏమాత్రం లేదని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. చిదంబరం ప్రకటనపై ఆయన ధిక్కార స్వరం వినిపించారు. తెలంగాణ ఉద్యమం ఈనాటిది కాదని గత 56 ఏళ్లుగా జరుగుతోందన్నారు. తెలంగాణ రాత్రికి రాత్రి రాదని కేంద్ర మంత్రి చిదంబరం అనడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. ఇన్నేళ్లుగా కొనసాగుతున్న ఉద్యమం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను సైతం ఇచ్చి రెండు నెలలు అవుతోందని, మరి ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. అఖిలపక్షాన్ని సమావేశ పరిచి ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఆయన కోరారు.

సీమాంధ్ర నేతలు గత డిసెంబర్ 10న చేసిన కుట్ర మళ్లీ చేసేందుకు సిద్ధమయ్యారన్నారు. మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి, ఎంపీ కావూరి సాంబశివరావు, సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ నేతలు తెలంగాణ రాకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సీమాంధ్ర నేతల చర్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో గానీ మరెక్కడైనా ఏమైనా జరిగితే దానికి సీమాంధ్ర నేతలే బాధ్యత వహించాలన్నారు. ఇన్నాళ్లు కాంగ్రెసు అధిష్టానంపై నమ్మకంతో ఓపిక పట్టామని చెప్పారు. అధిష్టానంపై ఒత్తిడి తీసుకు వచ్చి తెలంగాణ సాధిస్తామని రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. తెలంగామపై కుట్రల కోసమే సీమాంధ్ర నేతలు భేటీ అయ్యారన్నారు.

English summary
Ex Minister Ramreddy Damodar Reddy said that they have no need of patience today. He condemned Chidambaram statement on Telangana issue. He demanded centre to announce Telangana soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X