జైపాల్ రెడ్డి బయటకు వస్తే కేంద్రం మెడలు వంచొచ్చు: మధు యాష్కీ
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై స్పందించరని, ఆయన బయటకు వచ్చి తెలంగాణ కోసం పోరాడితే కేంద్రం మొడలు వంచి తెలంగాణను సాధించుకోవచ్చునని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ బుధవారం అన్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ కూడా తెలంగాణపై ఏమాత్రం స్పందించరన్నారు. తెలంగాణపై ముఖ్యమైన నేతలు స్పందించక పోవడం మన దురదృష్టమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్ర నేతల కుట్రల వల్లనే తెలంగాణ ఆలస్యం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం కావూరి ఇళ్లు మాత్రమే ముట్టడించారని, అయితే భవిష్యత్తులో తెలంగాణకు అడ్డుపడే అందరు సీమాంధ్రుల నేతల ఇళ్లను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్‌లో సీమాంధ్రకు అనుకూలంగా సమావేశాలు నిర్వహించుకుంటే ఊరుకునేది లేదన్నారు. లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివరావు వంటి నేతలు అంగబలం, అర్థబలంతో తెలంగాణను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.
Nizamabad MP Madhu Yashki fired at Central Minister Jaipal Reddy today. He said Jaipal Reddy will not fight and PCC president D Srinivas not talk about Telangana. So Telangana is late, he said.
Story first published: Wednesday, March 2, 2011, 16:40 [IST]