కావూరి ఇంటిముందు టి-లాయర్ల ఆందోళన: ఉండనివ్వమని హెచ్చరిక

జై తెలంగాణ అంటూ కావూరి ఇంటిలోకి చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. సమావేశం నిర్వహించ వద్దని కావూరికి లేఖను ఇస్తామని వారు చెప్పారు. అయితే ఇంట్లో కావూరి లేఖ పోవడంతో వారు అక్కడే ఆందోళనకు కూర్చున్నారు. తాము సీమాంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రమే కోరుకుంటున్నామన్నారు. తెలంగాణను అడ్డుకుంటున్న కొందరు సీమాంధ్ర నేతలకే తాము వ్యతిరేకమన్నారు. తెలంగాణకు సీమాంధ్ర పెట్టుబడిదారులు మద్దతుగా నిలవకుంటే వారి వ్యాపారాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. వారిని ఇక్కడ ఉండనిచ్చేది లేదన్నారు. న్యాయవాదులను పోలీసులు అరెస్టు చేసి పంజగుట్ట పోలీసు స్టేషన్‌కు తరలించారు.