హైదరాబాద్: మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి సమైక్యాంధ్ర కోసం అంటూ తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిని కలవడం విడ్డూరమని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం అన్నారు. రాష్ట్ర ప్రజలను జెసి తప్పు దోవ పట్టించడానికే చంద్రబాబును కలిశారని ఆరోపించారు. తమకు తెలంగాణ, సీమాంధ్ర రెండు ప్రాంతాలు సమానమని చంద్రబాబు పలుమార్లు చెప్పారని అయినప్పటికీ జెసి సమైక్యాంధ్ర అంటూ మా అధినేతను కలవడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటివి ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా ఉంటాయన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, కేంద్రమంత్రి చిదంబరం కారణమని ఆయన ఆరోపించారు. తెలంగాణ అంశాన్ని వాయిదా వేస్తూ వెళ్లడం వల్లనే రాష్ట్రంలో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కేంద్రం ఏదో ఒకటి తేల్చాలని చెప్పారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా చేయడమే కాంగ్రెస్ ఎజెండా అని అన్నారు. టిడిపి ఎమ్మెల్యేలు సభను బహిష్కరించరని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడటమే టిడిపి ఉద్దేశ్యమన్నారు. ఏ సమస్య అయినా సభ ద్వారా పట్టుపడతామన్నారు. ప్రజల కోసం సభలో అందరం ఉంటామని చెప్పారు.
Ex Minister Yanamala Ramakrishnudu fired at Ex Minister JC Diwakar Reddy as his met with TDP president Chandrababu for united Andhra Pradesh. He blamed AICC president Sonia Gandhi and Chidambaram for the situation in state.
Story first published: Wednesday, March 2, 2011, 13:22 [IST]