ఎంపీ కావూరి సాంబశివరావుపై విరుచుకుపడిన తెలంగాణ మంత్రులు

Kavuri Sambhasiva Rao
హైదరాబాద్: ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావుపై తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, బస్వరాజు సారయ్య అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులను ఆయన రాజీనామా చేయమని సవాల్ చేయడమేమిటని అన్నారు. ఆయన రాజీనామా చేయమంటే మేం చేయాలా అని ప్రశ్నించారు. బుధవారం కావూరి ఇంటిని ముట్టడించిన లాయర్లు ఎలాంటి దాడులకు పాల్పడలేదన్నారు. తెలంగాణ ప్రజల గురించి, నేతల గురించి ఆయన మరోసారి మాట్లాడకూడదని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలకు వెంటనే కావూరి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలను ఆయన రెచ్చగొడుతున్నారన్నారు.

అధికారం లేకుంటే బతకలేని వాళ్లు సీమాంధ్ర పెట్టుబడి నేతలే అని ఆరోపించారు. కావూరి ఎంపీ అయిందే దోచుకోవడానికి అని అన్నారు. గంటసేపు అధికారం లేకుంటే బ్రతకలేని వాళ్లు తెలంగాణ వాళ్లు కాదని కావూరి లాంటి వాళ్లే అన్నారు. ఆయన దోచుకోవడానికి ఎంపీ అవుతున్నారని, అందుకే ఆయన ఐదుసార్లు ఎంపీ అయినా మంత్రి పదవి రాలేదని, అదే పురందేశ్వరికి ఒకేసారికి వచ్చిందన్నారు. కావూరి తెలంగాణ నేతలపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆయనకు ధనార్జనే ధ్యేయమన్నారు. ఆయన వ్యాఖ్యల ద్వారా పెట్టుబడిదారి మనస్తత్వం మరోసారి బయటపడిదంన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులను విమర్శించే హక్కు లేదన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీపై మాకు నమ్మకం ఉందన్నారు. ఆమె వద్దే తెలంగాణ అంశంపై తేల్చుకుంటామని చెప్పారు. రెండురోజుల్లో కార్యాచరణ రూపొందిస్తామని తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకోకుంటే ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని చెప్పారు. రాజీనామాలకు కూడా సిద్ధమని హెచ్చరించారు.

కావూరి తన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని మరో మంత్రి బస్వరాజు సారయ్య డిమాండ్ చేశారు. లేదంటే కావూరిని తెలంగాణ ప్రజలు క్షమించరన్నారు. సోనియాపై మాకు నమ్మకముందని, ఆ నమ్మకంతోనే తెలంగాణ సాధిస్తామని చెప్పారు. కాగా నల్గొండ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి తన రాజీనామా విషయమై కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలతో చర్చించిన అనంతరం నిర్ణయించుకుంటానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+