లోక్‌సభలో ఏడ్చిన రాములమ్మ: ప్రణబ్‌కు చేతులెత్తి నమస్కారం

గురువారం తెలంగాణ నినాదాలతో లోక్‌సభ ఐదుసార్లు వాయిదా పడింది. టిఆర్ఎస్ ఎంపీలు కె చంద్రశేఖరరావు, విజయశాంతి పలుమార్లు తెలంగాణపై చర్చకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పోడియం వద్దకు దూసుకు పోయారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఎల్‌కె అద్వానీ, బిజెపి పార్లమెంటరీ నేత సుష్మాస్వరాజ్ తెలంగాణ వారికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వాదులకు మద్దతుగా మాట్లాడారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే ఎన్డీయే మద్దతు ఇస్తుందని ప్రకటించారు.












Click it and Unblock the Notifications