ఎల్లుండి నుంచి అసెంబ్లీకి తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేల హాజరు

తెలంగాణ రాష్ట్ర సాధనకు ఏ స్థాయి ఉద్యమాలను నిర్వహించడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లును ప్రతిపాదించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సహాయ నిరాకరణ ఉద్యమంతోనైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని వారన్నారు. శాసనసభకు హాజరు కావాలని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడడంతో ఎల్లుండి నుంచి హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications