పూణేలో నల్లధనం కేసు నిందితుడు హసన్ అలీ ఖాన్ అరెస్టు

Hasan Ali Khan
పూణే: విదేశాల్లో నల్లధనం దాచాడని ఆరోపణలు ఎదుర్కుంటున్న స్టడ్ ఫార్మ్ యజమాని హసన్ అలీ ఖాన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోమవారం పూణేలో అరెస్టు చేశారు. హసన్ అలీ ఖాన్ పెద్ద యెత్తున మనీ లాండరింగ్‌కు పాల్పడ్డాడని, పన్ను ఎగవేశాడని ఆరోపణలున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు రెండు బృందాలు సోమవారం ఉదయం ముంబై నుంచి పూణేకు చేరుకుని ఖాన్ నివాసంలో సోదాలు నిర్వహించాయి.

రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కూడా అయిన ఖాన్ విదేశీయుల సహాయంతో చట్టవిరుద్ధంగా విలువైన ఆస్తులను, నగదును దేశం దాటించినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది. ఖాన్ నివాసంపై 2007లో ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఖాన్ ఆస్తులను గుర్తించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. విచారణ నిమిత్తం హసన్ అలీ ఖాన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ముంబైకి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+