హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్, కోదండరామ్ మధ్య విభేదాలు, మిలియన్ మార్చ్ కారణం?

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao-Kodandaram
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ కత్తులు దూసుకుంటున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇరువురి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయంటూ సోమవారం ఓ ప్రముఖ దినపత్రికలో వార్తాకథనం ప్రచురితమైంది. ఈ నెల 10వ తేదీన తలపెట్టిన మిలియన్ మార్చ్ టు హైదరాబాద్ కార్యక్రమం ఈ విభేదాలకు కారణమైనట్లు భావిస్తున్నారు. మిలియన్ మార్చ్‌ను వాయిదా వేయాలా, కొనసాగించాలా అనే అంశంపై చర్చించేందుకు సోమవారం తెలంగాణ జెఎసి సమావేశమైంది. ఈ సందర్భంగా కోదండరామ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తానూ కెసిఆర్ కత్తులు దూసుకుంటున్నట్లు వచ్చిన వార్తను ఖండించారు. దయచేసి అటువంటి వార్తలు రాయవద్దని ఆయన మీడియాను కోరారు.

అయితే, ఇరువురి మధ్య మిలియన్ మార్చ్ తేదీ ప్రకటనే విభేదాలకు దారి తీసినట్లు చెబుతున్నారు. మార్చి రెండో వారంలో చలో హైదరాబాద్ ఉంటుందని కోదండరామ్ ఫిబ్రవరి 24వ తేదీన ప్రకటించారు. అయితే, మార్చి పదవ తేదీన మిలియన్ మార్చ్ టు హైదరాబాద్ ఉంటుందని ఫిబ్రవరి 26వ తేదీన ఇంటర్మీడియట్ బోర్టు కార్యాలయం వద్ద జరిగిన జూనియర్ లెక్చరర్ల కార్యక్రమంలో కెసిఆర్ ప్రకటించారు. విద్యార్థుల పరీక్షలకు ఆటంకం కలిగించే ఉద్దేశం తమకు లేదని అదే సమావేశంలో కోదండరామ్ అంతకు ముందు ప్రకటించారు. కెసిఆర్ ఏకపక్ష ప్రకటనకు బిజెపి నిరసన వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తోంది. కెసిఆర్ ఏకపక్ష ప్రకటనకు కోదండరామ్ కూడా ఆశ్చర్యపోయినట్లు చెబుతున్నారు.

ఇప్పుడు మిలియన్ మార్చ్ టు హైదరాబాద్ వివాదంలో చిక్కుకుంది. పరీక్షలకు ఆటంకం కలిగించవద్దని, కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నట్లు కెసిఆర్‌తో పాటు కోదండరామ్ కూడా చెబుతున్నారు. అయితే, అప్పటికే మిలియన్ మార్చ్‌ టు హైదరాబాద్ కార్యక్రమానికి జెఎసి ఏర్పాట్లు చేసుకుంది. ప్రభుత్వ కుట్రలో భాగంగానే మార్చ్‌ను వాయిదా వేయించే ప్రయత్నాలు సాగుతున్నాయని తెలంగాణవాదుల నుంచి వినిపిస్తోంది. పదవ తేదీ పరీక్షను వాయిదా వేసుకుంటే సరిపోతుందని, కానీ కార్యక్రమాన్ని వాయిదా వేయించే ఉద్దేశంతో ప్రభుత్వం వివిధ వర్గాల నుంచి తమపై ఒత్తిడి తెస్తోందని వారంటున్నారు. ఈ స్థితిలో మిలియన్ మార్చ్‌ను వాయిదా వేసుకోవాలా, వద్దా అనే విషయంపై చర్చ జరుగుతోంది.

English summary
According to a news report - differences cropped up between TRS president K Chandrasekhar Rao and Telangana political JAC chairman Kodandaram. Million March to Hyderabad programme created differences between the two leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X