హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్ర విభజనపై సీమాంధ్ర, తెలంగాణ మేధావుల మధ్య చర్చలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: రాష్ట్ర విభజన వివాదంలో కొత్త పరిణామం చోటు చేసుకుంది. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత మేధావుల మధ్య ఆదివారం సాయంత్రం చర్చలు జరిగాయి. రాష్ట్ర విభజన అనంతరం ఎదురయ్యే పరిణామాలపై చర్చించుకొని, సందేహాలను నివృత్తి చేసుకొంటే ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది. ఆదివారం సికింద్రాబాద్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం, తెరాస సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌, తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఆంధ్ర మేధావులు వేదిక అధ్యక్షులు చలసాని శ్రీనివాస్‌, ప్రొఫెసర్‌ రామకృష్ణరాజు, ప్రొఫెసర్‌ కృష్ణమోహన్‌రెడ్డి, సెస్‌ ప్రొఫెసర్‌ రామచంద్రయ్య, నీటిపారుదల రంగ నిపుణులు చెరుకూరి వీరయ్య సహా పలువురు మేధావులు పాల్గొన్నారు. భౌగోళికంగా విడిపోయినా, మానసికంగా కలిసి ఉండాలన్నదే అందరి ఆకాంక్ష అని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు ముందుకురాకపోతే పరిష్కారం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

నీటి వనరులు, హైదరాబాద్‌, ఉద్యోగాలు, తెలుగుభాష, సాధికార అభివృద్ధి వంటి ప్రధాన అంశాలపై సమావేశంలో ప్రాథమికంగా చర్చించారు. ఈ అంశాలపై పరిష్కరించుకొంటే ప్రస్తుత సందిగ్ధత తొలగిపోయి, అన్ని ప్రాంతాలు ప్రశాంతతతో కూడిన అభివృద్ధి బాటపడుతాయని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ తెలంగాణకు శాశ్వత రాజధానిగా ఉండాలని, విభజన జరిగిన అనంతరం 15 ఏళ్లపాటు సీమాంధ్రకు కూడా ఈ నగరమే రాజధానిగా ఉండాలనే అభిప్రాయం వ్యక్తమైంది. దీనికి తెలంగాణ ప్రాంతం నుంచి సుముఖత ఉంటుందా? లేదా? అనేది చర్చించాల్సి ఉందని భావించారు. విభజన తర్వాత హైదరాబాద్‌లోనే ఉండాలని కోరుకొనే ఉద్యోగులకు పదేళ్లు ఇక్కడే ఉండే అవకాశం కల్పించాలని అభిప్రాయపడ్డారు. మరో మూడు నాలుగు సార్లు విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించాలని ఇరుప్రాంతాల మేధావులు, నేతలు నిర్ణయించారు.

English summary
New development tool place in the issue of Andhra Pradesh division. Intellectuals of Seemandhra and Telangana met and discussed about the issues to be solved to smooth division.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X