చంద్రబాబుపై కిషన్ రెడ్డి ధ్వజం: నాగంకు కిషన్‌రెడ్డి మద్దతు
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విషయంపై తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సోమవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ అంశంపై చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో ముందుకెళ్లడం శోచనీయమన్నారు. తెలంగాణపై చంద్రబాబు వెంటనే తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. గత సాధారణ ఎన్నికలలో తెలుగుదేశం ముసాయిదాలోనే తెలంగాణకు మద్దతిస్తామనే విషయం ఉందని గుర్తు చేశారు.
తెలంగాణ అంశంపై అసెంబ్లీలో టిడిపి సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి వైఖరిని తాము పూర్తిగా మద్దతు ఇస్తున్నట్టు కిషన్‌రెడ్డి చెప్పారు. నాగం జనార్ధన్ రెడ్డి వారి పార్టీ మేనిఫెస్టోకు వ్యతిరేకంగా పోరాడటం లేదన్నారు. మేనిఫెస్టోలో ఉన్నదాని కోసమే ఆయన పోరాడుతున్నారని అన్నారు. ఆయనకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పారు. ఆయనతో తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజలు ఉన్నారని చెప్పారు.
BJP state president Kishan Reddy blamed TDP president and former chief minister Chandrababu today for Telangana issue at media point.He supports TDP senior MLA Nagam Janardhan Reddy attitude in assembly.
Story first published: Monday, March 7, 2011, 12:16 [IST]