హైదరాబాద్:
తెలుగుదేశం
పార్టీ
సీనియర్
ఎమ్మెల్యే
నాగం
జనార్ధన్
రెడ్డి
తానొక్కడే
తెలంగాణ
వాది
అయినట్లు,
మిగతా
వారు
కానట్లుగా
ఆయన
ప్రవర్తన
ఉందని
టిడిపికి
చెందిన
మరో
ఎమ్మెల్యే
మోత్కుపల్లి
నరసింహులు
సోమవారం
మీడియా
పాయింట్
వద్ద
తీవ్రస్థాయిలో
ధ్వజమెత్తారు.
నాగం
ఒక్కడు
రాజీనామా
చేసినంత
మాత్రాన
తెలంగాణ
రాదని
అన్నారు.
నాగం
జనార్ధన్
రెడ్డి
బ్లాక్
మెయిల్
రాజకీయాలకు
పాల్పడుతున్నారని
ఆరోపించారు.
తెలంగాణ
పేరిట
కాంగ్రెసు
పార్టీ
తెలంగాణ
ప్రజా
ప్రతినిధులు
నాటకాలు
అడుతున్నారన్నారు.
తెలంగాణ
తెలుగుదేశం
ప్రత్యేక
తెలంగాణ
రాష్ట్రానికి
కట్టుబడి
ఉందని
చెప్పారు.
కేంద్ర
ప్రభుత్వం
పార్లమెంటులో
బిల్లు
పెట్టాలని
ఆయన
డిమాండ్
చేశారు.
రాజ్యాంగ
సంక్షేమంతోనే
తెలంగాణ
సాధ్యమని
చెప్పారు.
తెలంగాణ
కాంగ్రెసు
శాసనసభ్యులు
ప్రత్యేక
రాష్ట్రంకోసం
రాజీనామాలకు
ముందుకొస్తే
టిడిపి
వారంతా
రాజీనామాలకు
సిద్ధమని
చెప్పారు.
నేను
ఆరుసార్లు
గెలిచానని
అయితే
పదవులు
తనకు
ముఖ్యం
కాదని
తెలంగాణ
ప్రజల
ఆకాంక్ష
అయిన
తెలంగాణ
రాష్ట్ర
సాధనే
తనకు
ముఖ్యమన్నారు.
తెలంగాణ
ప్రజల
ఆకాంక్ష
నెరవేర్చనప్పుడు
ఈ
పదవి
ఎందుకన్నారు.
కేంద్రమంత్రి
ప్రణబ్
ముఖర్జీ
తెలంగాణ
పార్లమెంటు
సభ్యులను
ఇష్టం
వచ్చినట్లు
మాట్లాడారని
అది
విచారకరమన్నారు.
అయితే
తెలంగాణ
అంశం
కేంద్రం
పరిధిలోనే
ఉందన్నారు.
తెలంగాణ
అంశంపై
మీడియా
ఆధ్వర్యంలో
ఓ
కమిటీ
వేసి
రాజీనామాకు
ముందుకు
వస్తే
అప్పుడు
ఎవరి
చిత్తశుద్ధి
ఏమిటో
తెలుస్తుందన్నారు.
కాగా
నాగం
జనార్ధన్
రెడ్డి
అసెంబ్లీలో
పార్టీలో
నిర్ణయించకుండానే
తానే
తెలంగాణవాదిని
అయినట్లుగా
మిగతా
వారిని,
పార్టీని
నష్టపరిచే
విధంగా
ఆయన
కార్యక్రమాలు
ఉన్నాయన్నారు.
TDP senior MLA Mothkupally Narasimhulu fired at senior MLA Nagam Janardhan Reddy today. He blamed Nagam for assembly attitude. He demanded centre to propose Telangana bill in Parliament.
Story first published: Monday, March 7, 2011, 11:12 [IST]